ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. కృష్ణుని శంఖము పేరేమి?
2. సోమదత్తు డెవరు? ఎవరి చేతిలో చనిపోయాడు?
3. అర్జునునకు సవ్యసాచి అని ఎందుకు పేరు వచ్చింది?
4. భారతంలో కృష్ణుడు విశ్వరూపాన్ని ఎప్పుడెప్పుడు చూపాడు? ఎవరెవరికి?
5. కౌరవ సైన్యం ఎంత? అందులో దుర్యోధనుని అసలు సైన్యం ఎంత?
--------------------------------------------------------------------------------

సమాధానములు
(జవాబులు):
1. పాంచజన్యము. (పంచజనుడనే రాక్షసుని వలన) – భీష్మ పర్వము – ప్రథమాశ్వాసము – 143 వచనము
వ॥అట్టియెడఁ గృష్ణార్జునులు పాంచజన్య దేవత్తంబులు పూరించిన. (143)

2. బాహ్లికుని కొడుకు – యుద్ధం 14వ రోజు తండ్రి పడిన కొద్దిసేపటికి సాత్యకి చేతిలో చనిపోయాడు. – ద్రోణ పర్వము – పంచమాశ్వాసము – 134 వచనము & 135 పద్యము
వ॥అట్టియెడ సోమదత్తుండు సమరోల్లాసంబునం
బాండవసైనికులు నిలునిలు మని యదల్చుచు నిల్చినం గనుంగొని సాత్యకి యతనితోడం దలపడినం దత్సంగ్రామంబు
భీమం బయ్యె నందు. (134)
సీ||సాత్యకివి ల్లర్ధ చంద్రబాణంబున నఱకి యాబాహ్లికనందనుండు

ముప్పదేనమ్ముల నొప్పింప నతఁ డొండు విలుగొని యాతని నలుఁగుటమ్ము
లైదింట నేసి మహారజతధ్వజం బిలఁ గూల్చి ధనువు చెక్కలుగఁ జేసెఁ
జిఱునవ్వుతో నాతఁ డుఱక వేఱొకవింట నేట్లాడఁగా భీముఁ డేసె నపుడు
తే॥తాఁకి మీతండ్రిపై ఘటోత్కచుఁడు
వైచెఁ
బరిఘమును
నది దునిమె నక్కురువరేణ్యుఁ
డపుడు
హయసారథులఁ జంపి యతనియుసుఱు
గొనియె
బలునారసమున నాశినివరుండు. (135)
3. రెండు చేతులతోను వింటినారిని లాగగలడు. అందులో ఎడమ చేతితో కూడా బాగా లాగగలడు. – విరాట పర్వము – చతుర్థాశ్వాసము - 145 పద్యము
క|| భండనమున నిరుగేలను
గాండీవము దివియ నేర్పు గలిగిన నం దు
ద్దండ మగుసవ్యకరముప్ర
చండతఁ బరఁగుదును సవ్యసాచి యనంగన్. (145)
క|| భండనమున నిరుగేలను
గాండీవము దివియ నేర్పు గలిగిన నం దు
ద్దండ మగుసవ్యకరముప్ర
చండతఁ బరఁగుదును సవ్యసాచి యనంగన్. (145)
4. 1) సభలో భీష్మ, ద్రోణ, విదుర, సంజయులు, ధృతరాష్ట్రునకు, మహర్షులకు – ఉద్యోగ పర్వము – తృతీయాశ్వాసము – 405 & 407 వచనము లు; 406,408 & 409 పద్యములు
వ|| అనియె నట్టియెడఁ గట్టెదుర నున్న యక్కురుపతికుమారుం జక్కంజూచి యే నొక్కరుండన యని తలంచియె దుర్మదంబునం బొదివి పట్ట నుత్సాహంబు సేసి తనుచు దరహాసంబు సేయువాసుదేవునిఫాలప్రదేశంబున బ్రహ్మయు వక్షంబున విరూపాక్షుండును వదనంబున వహ్నియు బార్శ్వంబుల నింద్ర యమ వరుణ కుబేరులు నాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినులు నుద్భవించిరి హలగాండీవమండిత బాహు లగుబలదేవార్జునులు సవ్యదక్షిణభుజంబులను నిజాయుధహస్తు లగు యుధిష్టిరభీమనకులసహదేవులు వీఁపునను వివిధప్రహరణపాణులగుయదువృష్ణి భోజాంధకవీరు లూరులను బ్రభవించిరి జనితనానాహస్తవిన్యస్తంబులయి శంఖచక్రగదాఖడ్గశక్తిశార్ఙ్గ ప్రముఖనిఖిల సాధనంబులు వెలింగె నేత్రశ్రోత్రనాసా వివరంబుల సధూమధూమకేతు జ్వాలాజ్వాలంబులు నిగిడె రోమకూపకలాపంబులం దరణికిరణనిభప్రభలు వెడలె నిట్లు దుర్నిరీక్ష్యం బగున త్తేజోరూపంబుఁ గనుంగొనంగొలదిఁగాక సకలజనంబులు నయనంబులు మొగిడ్చియద్భుతభయానకరసంబుల జొత్తిల్లు చిత్తంబులతోడం గదల కుండ నప్పుండరీకాక్షుండు నారదాది మహామునులవలనను భీష్మవిదురద్రోణ సంజయులయందును గరుణాంతరంగితంబగు కటాక్షవీక్షణం బొలయ వారలకు దివ్యదృష్టి యొసంగిన నాపుణ్యపురుషులు సాంద్రానందంబున దేలుచుండి రయ్యవసరంబున. (405)

తే||
దేవదుందుభివ్రాతంబు దివిరెఁ గల్ప
వృక్షపుష్పధారామయవృష్టి గురిసె
వృక్షపుష్పధారామయవృష్టి గురిసె
సిద్ధసాధ్యవిద్యాధరశ్రేణి భక్తి
నిచ్చుజయజయశబ్దంబు లేసఁగెఁ జదల (406)
నిచ్చుజయజయశబ్దంబు లేసఁగెఁ జదల (406)
వ||
అప్పుడు ధృతరాష్ట్రుం డమ్మహాసంకులంబు విష్ణుని దివ్యవిజృభణంబు గావలయు నని యూహించి (407)
క||
కరుణింపుము సంశ్రితభయ
హరణధురీణా సహింపు మజ్ఞానంబున్
శరణంబు వేఁడెద భవ
చ్చరణంబులు గనుఁగొనం బ్రసాదింపఁగదే. (408)

చ||
అనుదు
దయార్ద్రచిత్తుఁ డగునప్పరమేశ్వరుఁ డిచ్చె దృష్టి య
జ్జనపతి కద్భుతం బడర సమ్మదపూరము గ్రమ్మ నాతఁడుం
గనుఁగోని భక్తిమ్రొక్కి నినుఁ గంటిఁ గృతార్ధుఁడ నైతి నింక నొ
ల్ల నొరులఁ జూడ లోచనములం బురుషోత్తమ సంహరింపవే. (409)

2) ఉభయసేనల మధ్య అర్జునునకు; - భీష్మపర్వము – ప్రథమాశ్వాసము –
209 పద్యము;
210 వచనము
క|| విను మానుషచక్షుర్గతి
గనుఁగొన శక్యంబు గాదు కావున దానిం
గనుట కయి దివ్యచక్షు
ర్జననం బొనరింతు నీకు శత్రువిదారీ. (209)
వ|| అని యతనికి దివ్యదృష్టి యొసంగి యోగీశ్వరేశ్వరుం డైనయాలక్ష్మీశ్వరుండు తనదివ్యరూపంబుసూపె నావిశ్వరూపునిదివ్య తేజంబు సహస్రసూర్యప్రభానిభంబనుటయుం జాల కుండుం గావున వాక్రువ్వం గొలఁది గా దట్టిమహామూర్తిఁ గనుంగొని ధనంజయుండు విస్మయరోమహర్షణ ప్రహర్షోత్కర్షంబులతో దండ ప్రణామంబులు చేసి నిలిచి కేలు మోగిడ్చి యి ట్లనియె. (210)
౩) ఉత్తంకాశ్రమంలో ఉత్తంకునకు – అశ్వమేధపర్వము – తృతీయాశ్వాసము – 48&50 పద్యములు; 49 వచనము
చ॥అనుఁడు దయాళుఁ డైనహరి యర్జునుచూచినదివ్యమూర్తిఁ జూ

పినఁ గని సంప్రమోదమును భీతియు విస్మయముం బెనంగొనన్
మునిపతి పాణిపద్మములు మోడ్చి ‘నమః పురుషోత్తమాయ తే’
యనుచు వినీతి నమ్ర మగునంగము నివ్వెఱ నిశ్చలంబుగన్. (48)
వ॥ఒక్కింత నిలిచి నిభృతస్వరంబున.
(49)
సీ॥పుండరీకాక్ష యీభువనమంతయు భవత్పాదపం
కేరుహవ్యాప్త మయ్యె
నంబరం
బెల్లను నావృత మయ్యె నీమహితసముజ్జ్వలమస్తకముల
నంతరిక్షము
తవకాద్భుతకుక్షి దేశంబులచేత సంఛన్న మయ్యె
భవదీయమహనీయబాహార్గళానిచయాపిహితము
లయ్యె నన్నిదిశలు
తే॥బహుచరణముల బహుశిరోభాగములను
బహుజఠరముల
బహుభుజాప్రకరములను
దేవ
యిట్లు సర్వంబును నీవ యైత
నర్చి
తిది నాదుకన్ను మనంబుఁ దనిపె. (50)
5. 11 అక్షౌహిణిలు; ఒక అక్షౌహిణి – భీష్మపర్వము – ప్రథమాశ్వాసము –
95 వచనము
వ|| ……. ననేక దేశాధీశు లాత్మియచతురంగ బలసమన్వితులును నిజధ్వజవిరాజమానులును నానాభరణోజ్జ్వలాంగులును నయి సంగరకౌతుకంబు మొగంబులం దొంగలింప నరిగి రివ్విధ్మనం బది యక్షౌహిణులు నడవం బదునొకండవయక్షౌహిణితోఁ గురుక్షోణీవల్లభుండు…… (95)

**********************************************************************************************
No comments:
Post a Comment