Translate

24 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 049 (241 – 245)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్| 
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
 
1. అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు ఏమిటి?
2.
భారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది
3.
పరశురాముని తల్లితండ్రులెవరు?
4.
యుద్ధానికి ముందు రణభుమిలో కృష్ణుడు కర్ణునితో ఏమి మాట్లాడాడు?
5.
యుద్ధంలో రెండు రోజులు భీష్ముడు కృష్ణుని కూడా బాధించాడు, ఏయే రోజులలో?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. కంకుభట్టు విరాటపర్వము ప్రథమాశ్వాసము 197 పద్యము
|| నృపనయవిద్యకుం దగిననే ర్పలవడ్డది గొంత కొంత
    ర్మపరులసంగతిం దగిలి మచ్చిక నుండుదుఁ బేరు కంకుఁ డే
    వపుఁగొలు వైన నాకు నిలువన్ మది గొల్పదు గాన నిన్ను భూ
    మిపతులలోన సాధుజనమిత్త్రుఁడు నా విని కొల్వవచ్చితిన్. (197)

2. 18 రోజులు ఆదిపర్వము ప్రథమాశ్వాసము 69 పద్యము
శా|| ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షౌహిణుల్
     రూఢిం గౌరవసైన్య మీయుభయమున్ రోషాహతాన్యోన్య మై
     యీడంబోవక వీఁకమైఁ బొడువఁగా నేపారు ఘోరాజి
        ల్లాడెన్ ధాత్రి శమంతపంచకమునం దష్టాదశాహంబులున్. (69)

3. రేణుక, జమదగ్ని ఆరణ్యపర్వము తృతీయాశ్వాసము 139 వచనము.
|| ఆజమదగ్ని ప్రసేనజితుం డనురాజుకూఁతు రేణుక యనుదాని వివాహంబయి దానియందు రుమణ్వ త్సుషేణ వసు విశ్వావసు రాము లనువారి నైదుగురు కొడుకులం బడసి వనంబున నుగ్ర తపంబు సేయుచు..

4. భీష్ముడు పడేవరకూ సరదాగా పాండవుల పక్షంలో యుద్ధం చెయ్యరాదా! అని. భీష్మపర్వము  
    ప్రథమాశ్వాసము 163 పద్యము
తే|| అమరతటినీతనూజుపై యలుకఁ జేసి
    యనికిఁజొరవటె యట్లైన నతఁడుచచ్చు
    నంతదాఁకఁ బాండవులకై కొంత సమర
     కేలి వేడుకఁ జలుపుట పోలదొక్కొ. (163)

5. 3, 9 రోజులలో - భీష్మపర్వము ద్వితీయాశ్వాసము 146 పద్యము;
|| హరి తాను నొచ్చి నొచ్చిన
    నరునితెఱం గెఱిఁగి భీష్మునకు నించుకయుం
    గరలాఘవ మెడలమియుం
    దిర మై పరికించి తన మదిం దలపోయున్. (146)
********************************************************************************************

No comments:

Post a Comment