తెలుగు సుద్దులు…..(129)
క||ఇచ్చే వారల సంపద
హెచ్చేదే`కాని లేమి యేలా కలుగున్
అచ్చెలమ నీళ్లు చల్లిన
విచ్చలవిడి నూ`రుచుండు వినరా వేమా!.
భావముః
ఇతరులకు తమ సంపదను పంచేవారి (దాత) సంపద పెరుగుతుందేకాని, తరిగిపోదు –
వారిదగ్గరకు
దారిద్ర్యం దరిచేరదు. వేమన దీనిని చక్కటి ఉపమానంతో మనకు అవగాహనకల్గిస్తున్నారు. నీటిచెలమలో నీరు తోడి బయటకు పోసేకొద్ది, స్వచ్ఛమైన మంచినీరు ఊరుతుంటుంది. లోభత్వం వల్ల ప్రయోజనం లేదు, దాతృత్వము వల్ల సంపద పెరుగుతూనే ఉంటుందని గ్రహించి దానశీలత కలిగియుండవలని హితవుపలుకుతున్నారు. ||01-01-2015||
No comments:
Post a Comment