Translate

06 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 41 (201 – 205)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1. ఉత్తముడని ఎవరి నంటారు?
2.
నిద్రలేక బాధపడేవారు నల్గురెవరు?
3.
పాండవుల పక్షంలో యుద్ధానికి ప్రోత్సహించేవారెవరని ధృతరాష్ట్రు డడిగితే సంజయుడు ఎవరని చెప్పాడు?
4.
రుక్మి యొక్క ధనుస్సు పేరేమి?
5.
భీష్ముడు కర్ణుని అర్ధ రధుడని ఎందుకన్నాడు?
-------------------------------------------------------------------------------- 
సమాధానములు (జవాబులు):
1. కఠినంగా మాట్లాడనివానిని, పాపపు పని చేయనివానిని - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 41 పద్యము
|| పురుషుండు రెండు దెఱఁగుల
   ధర నుత్తముఁ డనఁగఁబరఁగుఁ దా నెయ్యడలం
   బరుసములు వలుక కునికిన్
   దురితంబులు వొరయుపనులు దొఱఁగుటకతనన్. (41)

2. బలవంతుడు దండెత్తి వస్తుంటే బలహీనునికి; ధనం కోలుపోయిన వానికి; దొంగతనము చేయటానికి  
    నిరీక్షించేవానికి; కామాకుల చిత్తునకు - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 21 పద్యము
|| బలవంతుఁడు పై నెత్తిన
 బలహీనుఁడు ధనముగోలుపడినయతఁడు మ్రు
 చ్చిల వేచువాఁడు గామా
 కులచిత్తుఁడు నిద్ర లేక కుందురు రధిపా. (21)

3. ధృష్టద్యుమ్నుడు. - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 243 పద్యము
|| నావుడు సంజయుఁ డి ట్లను
 దేవా పాండవులయలుక ధృష్టద్యుమ్నుం
 డేవెరవుమాట నైనను
  నే వోసినయగ్నిభంగి నిగుడం జేయున్. (243)

4. విజయము.- ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము 174 పద్యము
సీ|| కృష్ణుని దేవి రుక్మిణిసోదరుఁడు రుక్మి యనువాఁడు (రాజు) బలవిక్రమాన్వితుండు
 శార్ఙ్గ గాండీవవిజయములు నాఁ గల దివ్యచాపములఁ దృతీయ మైన
 చాపంబు గలవాఁడు సైన్యసమేతుఁ డై చనుదెంచి ధర్మజుఁ గని తదీయ
 సత్కారములు గాంచి సముచితాసనమున నుండి యక్కొలువున నున్న వీరు
|| లెల్ల వినఁ గిరీటి కిట్లను సమరంబు
  సేయ వెఱచితేనిఁ జెప్పు నాకు
  నెదురు లేరు జగతి నెవ్వరు నీకుఁ దో
  డ్పడి జయింతు నెట్టిపగఱ నైన. (174)

5. పారిపోయే లక్షణం ఉంది కనుక. - ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము 235 పద్యము
|| అనవుడు గురుఁ డి ట్లనుఁ
 ర్ణునిచందము మున్ను గడఁగు రోయఁడు పాఱన్ (బోరన్)
 విను మేమఱి యుండుం గా
 వున నీతం డర్ధరథుఁ డవుం దలపోయన్. (235)
******************************************************************************************

No comments:

Post a Comment