తెలుగు సుద్దులు…..(1౩1)
ఆ.వె॥చెడిన మానవులను చేపట్టి రక్షించి,
కడకు దేర్చిన`ట్టి ఘనుడు తలప.
కడిగి పుణ్యమై`న కడు శివు సన్నిధి,
నెడతెగకను యుందురె`పుడు వేమ!
భావముః
చెడు మార్గంలో పడిన మానవులను తమ బోధలతో, సరిఐన మార్గమ్లో పెట్టి వారికి చివరకు ముక్తి, సద్గతి లభించేటట్లు చేసినట్టి పరమ గురువు, యోగి తలుచుకున్న మాత్రమే అత్యంత నిర్మలత్వము,
పుణ్యవంతము అయిన పరమశివుని సాన్నిధ్యమును అనవతరము పొందియుండెదరు.
ఈ పద్యములో పరమ గురువు, యోగి యొక్క విశిష్టతను తెలుపుతు, జ్ఞానబోధచేయువారు శివునికి అత్యంత ఆత్మీయులని వేమన హితవు తెలుపుతున్నారు.
||05-01-2014||
No comments:
Post a Comment