Translate

03 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 039 (191 – 195)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ఒంటరిగా చేయరాని పనులేవి?
2.
దుర్మార్గులకు గర్వమూ, సన్మార్గులకు వినయమూ కలిగిస్తాయిట మూడు; అవి ఏవి?
3.
పాండవులు ఎవరి సలహాతో ధృష్టద్యుమ్నుని సైన్యాధ్యక్షుని చేశారు?
4.
ప్రవర్తన అనే సముద్రాన్ని తరింపజేసేది ఏది?
5.
రోషం మూర్తీభవించిన వృక్షం దుర్యోధనుడు; దీని మూలశక్తి ఎవరు?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. )మధుర పదార్ధాలు తినరాదు )పదిమంది నిద్రిస్తూంటే మేల్కొనరాదు )ఆలోచించరాదు   
  ఈ)బాటవెంటపోరాదు - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 38 పద్యము
|| విను మధురాహారంబులు
    గొనుటయుఁ బెక్కండ్రు నిద్ర గూరినయెడ మే
    ల్కనియునికియుఁ గార్యాలో
    చనముఁ దెరవు నడుచుటయును జన దొక్కనికిన్. (38)

2. ధనము, విద్య, వంశము. - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 35 పద్యము
||ధనమును విద్యయు వంశం
    బును దుర్మతులకు (దుర్మదులకు) మదంబుఁ బొనరించును (బొదలించును)
    జ్జను లైనవారి కడఁకువ
    యును వినయము నివియ తెచ్చు నుర్వీనాధా. (35)

3. కృష్ణుని సలహాతో. - ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము 103 పద్యము
|| అనుటయు దామోదరుఁ డి
    ట్లను ధృష్టద్యుమ్నుఁ డర్హుఁ డగునభిషేకం
    బొనరింపుము పేరోలగ
    మున నక్షోహిణుల కెల్ల ముఖ్యుఁడు గాఁగన్ (ముఖ్యుఁడగుటకున్)(103)

4. సత్యమనే నావ. - ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 39 పద్యము

||నడవడి యనుమున్నీటిం
   గడవం బెట్టంగ నోడకరణిం దగి తా
   నొడఁగూడు ననిన సత్యము
   గడిచినగుణ మింక నొండు గలదే యరయన్. (39)

5. ధృతరాష్ట్రుడు. - - ఉద్యోగపర్వము ప్రమాశ్వాసము 355 పద్యము

||రోషమయమహాతరువు సుయోధనుఁ డురు
    స్కంధ మందులోనఁ గర్ణుఁడలరుఁ (డరయఁ)
    గొమ్మ సౌబలండు గుసుమఫలములు దు
    శ్శాసనుండు మూలశక్తితండ్రి. (355)
******************************************************************************************
 

No comments:

Post a Comment