Translate

03 January, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 040 (196 – 200)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|

[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ధర్మసూతి మెత్తని పులి మాటలెవరన్నారు?
2. కాపురుషుని(కుత్సిత పురుషుని) లక్షణాలు ఏవి?
3. భీష్మ పరశురాముల యుద్ధానికి కారణం ఎవరు?
4. రోగం లేకుండానే బాధపడే వాడెవడు?
5. కర్ణునికి సారధ్యం చేయవలసినదని శల్యుని ముందుగా కోరినదెవరు?
--------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. సంజయుడు రాయబారానికి వెళ్ళి తిరిగి వచ్చి ధృతరాష్ట్రునితో మాట్లాడుతూ మాటలంటాడు. -  
    ఉద్యోగపర్వము  ద్వితీయాశ్వాసము 14 పద్యము
|| అనయము (అనలము) వుట్టె జూదమున యప్పుడు యెంతయుఁ జిచ్చు (జిక్కు) వెట్టి కా
    ల్చినయది నీయుపేక్షయ వశికృతచిత్తుఁడు ధర్మసూతి మె
    త్తనిపులి యెల్లవారలు నధర్మము నీపయిఁ బెట్టునంతకు
    న్వినఁడును గానఁడుం బిదప నీకును నాకు మరల్ప వచ్చునే. (14)


2. కోపము, ఉబ్బిపోవడము, గర్వము, అసంతృప్తి, దురభిమానము, సోమరితనము. - ఉద్యోగపర్వము      ద్వితీయాశ్వాసము 32 పద్యము


|| కోపము నుబ్బును గర్వము

    నాపోవకయునికియును దురభిమానము ని (దు)

    ర్వ్యాపారత్వము ననునివి

    కాపురుషగుణంబు లండ్రు కౌరవనాధా. (32)


3. అంబ. భీష్ముడు అంబను వివాహము చేసుకొనుట కుదరదన్నపుడు, పరశురాముని ఆశ్రయించినదిపరశురాముడు భీష్మునితో అంబను వివాహము చేసుకోమంటాడు. పరశరాముని మాటనూ భీష్ముడు కాదన్నప్పుడు ఇరువురు తలపడ్డారు. ఉద్యోగపర్వము చతుర్థాశ్వాసము 310 పద్యము.


|| అనుమాటకుఁ గాలానల

    మునుబోలెను మండి కయ్యమున కాయిత మై

    మొన్లేర్చి వేగ యిచటికిఁ

    జను దె మ్మని భార్గవుండు సంరంభమునన్. (310)


4. ఇతరుల ధనానికీ, విద్యకూ, తేజస్సుకూ, బలానికీ అసహ్యించుకొనేవాడు రోగం లేకుండానే  
   బాధపడతాడు. -  ఉద్యోగపర్వము ద్వితీయాశ్వాసము 58 పద్యము

|| పరుల (ఒరుల) ధనమునకు విద్యా

    పరిణతికిం దేజమునకు బలమునకు మనం

    బెరియఁగ నసహ్యపడున

    న్న రుఁడు దెవులు లేనివేదనం బడు నధిపా. (58)



5. ధర్మరాజు. దుర్యోధనుడు మోసగించి శల్యుని తన పక్షాన చేర్చుకున్నందుకు కర్ణునికి   
  సారధ్యం చేస్తూ కర్ణుని కించపరిచి మాట్లాడి అర్జునుని రక్షించుమని ధర్మరాజు తన మేనమామ  
  శల్యునితో అంటాడు. -  ఉద్యోగపర్వము  ప్రమాశ్వాసము 110 వచనము

|| ……మీకుం గర్ణసారధ్యంబు గర్తవ్యంబు గాఁగలయది సమర సమయంబున నిరాకరించి పలికి కర్ణు చిత్తంబునకుం గలంక వుట్టించి పార్ధు రక్షింప వలయు నకృత్యం బని యనుమానింపక మత్ప్రార్ధనంబున నెల్లభంగుల నివ్విధంబనుష్టింపవలయు నని యభ్యర్ధించిన సమ్మతించి శల్యుం డి ట్లనియె. (110)



******************************************************************************************
 

No comments:

Post a Comment