ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. కొన్ని పనులు సమానులతోనే తగును. అధికులతో, హీనులతో తగవు, ఏమిటా పనులు?
2. ధర్మరాజడిగిన అయిదూళ్లు ఏవి?
3. కృష్ణునికి లంచమిచ్చి తన ప్రక్కకు త్రిప్పుకోవాలని ధృతరాష్ట్రుడాలోచించాడు, దాన్ని తెలిసి వారించిన దెవరు?
4. ఆయుధం పట్టనన్న కృష్ణుని అర్జును డెందుకు కోరుకున్నాడు?
5. “పెట్టనికోట నీకు హరి” ఈమాటలెవరన్నారు, ఎవరితో?
--------------------------------------------------------------------------------

సమాధానములు
(జవాబులు):
1. స్నేహము, సంభాషణము, బలిమి, వివాదము, యుద్ధము, న్యాయము - ఉద్యోగపర్వము –
ద్వితీయాశ్వాసము – 46 పద్యము
క|| చెలిమియు సంభాషణమును
బలిమి వివాదంబుఁ ద్రోపు బాడియు దమయం
తలవారితోన తగు నధి
కుల హీనులతోడ నైనఁ గొఱగా దధిపా. (46)

2. 1) కుశస్థలము 2) వృకస్థలము 3) వాసంతి 4) వారణావతము 5) మరొకటి ఏదయునా -
ఉద్యోగపర్వము – ప్రథమాశ్వాసము
– 377 వచనము
వ॥ఏము కలహం బొల్లక పొందు గోరుట తనకు మేలు దనమనంబున దరికొను తృష్ణానలం బార్ప నొరు లడ్డంబు సొరమింజేసి యేన బుద్ధి సెప్ప వలసెఁ దన యొద్దం గలయోధవీరు లెయ్యడల లేమి దెల్లం బయినను మాకుఁ జేదోడు ధర్మంబు గల దదియునుం గక యఖిలలోకసేవితుం డైనకృష్ణుండు పెనుఁబ్రాపుగావునఁ దమకు మమ్ము గెలువం గొలది గ దది యట్లుండె నేను భీమసేనాదులకుం దమకుం బెద్దవాఁడ నగుట వీరును దారును మదీయప్రార్థనాభంగంబు సేయక నాదగుశాంతియు దాంతియుఁ జెల్లించి నన్నలజడిఁ బెట్టక పోరితంబుడిగి తమతమధనంబులు గుడిచి సుఖం బుండుట మనపెద్దలకుం దక్కటిబుద్ధిమంతులకును సంతోశం బగుఁ బెద్ద యీనోపఁ డయ్యెనేనిఁ గుశస్థలంబును వృకస్థలంబును వాసంతియు వారణావతంబును జాలుఁ గ్దేని మఱియు నెందేని నొక్కటి యగునట్లుగాఁ దనతోడబుట్తువు లేవురకు నిలువ ఠావు లయి దిచ్చిన సర్వశామ్తియగు న ట్లయినను నిందలియందలిబంధుమిత్రసహయజనంబులు గలసి నవ్వుచుం దెగడుచు నునికి మనమనంబులకుఁ బ్రియంబు సేయుఁ గురుపాంచాల యాదవ మాత్స్యులు పరస్పరప్రీతిసంపాదకత్వసంపన్ను లై బ్రదుకుట నాకుం గోర్కి యింతయు నమ్మహాపురుషునకుం దెలియం జెప్పు మనిన విని దేవా నీయానతిచ్చిన మార్గం బంతయు నడపెద మీతండ్రి నీకును దమ్ములకును వాసుదేవునకును నెట్లుప్రియం బట్లు సేయువాఁడ కాక యనుచుం బ్రణామంబు సేసిన సంజయునకు ధనంజయుం డి ట్లనియె. (377)

3. విదురుడు. - ఉద్యోగపర్వము – తృతీయాశ్వాసము –
159 పద్యము
ఉ||నీతలఁ
పేను
గంటి
నొకనేర్పున శౌరికి లంచం మిచ్చి సం
ప్రీతునిఁ జేసి కార్యగతి భేదము సేయఁగఁ జూచె దింత బే
లైతిగదే సుమేరుసదృశార్థముఁ జూచియుఁ బార్ధుఁ బాయునే
యాతఁడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీ వెఱుంగవే. (159)

4. కృష్ణుడున్న పక్షం జయిస్తుందని అర్జునుని విశ్వాసం. - ఉద్యోగపర్వము – ప్రథమాశ్వాసము – 87 వచనము
వ|| నీ కెదు రై జయంబు గొన రా దట్లగుటంజేసి విజయమూలం బగునీతోడును వలయు నీవు సమరంబు సేయ కునికియుం బ్రియంబు కావున నిన్నుం గోరికొంటి నని చెప్పి మఱియు ని ట్లనియె. (87)
5. సంజయుడు ధర్మరాజుతో రాయబారానికి వచ్చినపుడు. - ఉద్యోగపర్వము – ప్రథమాశ్వాసము –
297 పద్యము
ఉ|| పెట్టనికోట నీకు హరి భీముఁడు నర్జునుఁడున్ రణంబునం
దొట్టినమంట లాకొలఁదియోధుల సాత్యకియున్ విరాటుఁడుం
జుట్టపుమేరు వుగ్రరణశోభితుఁ డీద్రుపదుండు నిన్ను ని
ట్ట ట్టన వచ్చునే సురల కైనను నొల్లవుగాక చివ్వకున్. (297)

******************************************************************************************
No comments:
Post a Comment