తెలుగు సుద్దులు…..(110)
ఆ.వె||నిన్ను జూచుచుం`డ నిండును తత్వంబు;
తన్నుజూచుచుం`డ తగులు మాయ
నిన్ను నె`రిగిన`పుడె తన్ను దానె`రుగును
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
నిన్ను (పరమేశ్వరుని, పరమాత్మను) గుర్తించి దర్శించగలినపుడు పరమాత్మ తత్వము, స్వభావము గ్రహించగలగడం పరిపూర్ణమవుతుంది. అలాకాకుండా కేవలము తన్నుమాత్రమే (అజ్ఞానంలో ఉండి భౌతిక శరీరమును మాత్రమే దర్శిస్తుంటే) చూస్తుంటే, మాయలో (వాస్తవంగా ఏది లేదో అది ఉన్నట్లుగా తోచడం) పడుతాడు. నిన్ను
(పరమాత్మను), నీ ఉనికిని తెలుసుకుంటేనే తన్ను తాను తెలుసుకోగలుగుతాడు. ఈ పద్యంలో వేమన, మనలను మాయనుండి బయటపడి మనోస్థిరంగా పరమాత్మను (పరమేశ్వరుని)
దర్శించమని బోధిస్తున్నారు. ||18-11-2014||
No comments:
Post a Comment