Translate

14 November, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-108



తెలుగు సుద్దులు…..(108)
               
.వె|| మదినె`రిగిన వాని మహి (*) గాన మెం`దును
         మదినె`రుంగు నరుడు మహిని నరుదు (నరుడె మహిమనుజుఁడు*)
       వెదకి తనువులోన వేడ్కతో నిను జూచు      
         విశ్వదాభిరామ వినర వేమా!.
* పాఠాంతరము
భావముః
భూమి మీద ఆత్మ గురించి సంపూర్ణంగా తెలిసిన వానిని (పరమేశ్వరుని) ఎక్కడ చూడలేము.  భూమి మీద ఆత్మతత్వము (జ్ఞానము) గురించి తెలుసుకొనే (గ్రహించే) వ్యక్తే నిజమైన మనుష్యుడు.  అతడు ఎంతో ఆర్తితో (కోరికతో, ప్రార్ధనతో) తనలో ఉన్న నిన్ను (పరమాత్మను-ఆత్మలింగము) వెదికి దర్శించగలడు.
పరమేశ్వరుడు (భగవంతుడు) వేరే ఎక్కడలేడు, నీలోనే ఉన్నాడురా, అది గ్రహించి నీలో ఉన్న ఆ అత్మ స్వరూపాన్ని దర్శించి ఈ మానవ జన్మ ధన్యత చేసుకోమని ఈ పద్యంలో వేమన ఒక యోగిగా మనకు ఆత్మ తత్వం యొక్క విశిష్ఠత తెలుపుతూ, దిశా నిర్దేశము చేస్తూ హితవు పలుకుతున్నారు. అంతే కాకుండా, ప్రతి వ్యక్తిలోను (జీవిలో) పరమేశ్వరుడున్నాడు అనేది కూడా వ్యక్తీకరించినట్లున్నది. ||14-11-2014||

No comments:

Post a Comment