ఓం గణేశాయనమః – గురుభ్యోనమః |
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా]
1. కురు పాండవుల వంశానికి మూలపురుషుడెవరు?
2. శ్రీ మహభారతాన్ని సంస్కృతములో రచించినదెవరు?
3. ఈ మహాభారతాన్ని మొదట ఎవరు ఎవరికి చెప్పారు?
4. భీష్ముని మొదటి పేరేమి?
5. పర్వం అని భారత భాగాలకు పేరు ఎందుకు పెట్టారు?
4. భీష్ముని మొదటి పేరేమి?
5. పర్వం అని భారత భాగాలకు పేరు ఎందుకు పెట్టారు?
సమాధానములు (జవాబులు):
1. చంద్రుడు – ఆదిపర్వం – ప్రథమాశ్వాసము – 14 పద్యము
చ|| హిమకరుఁదొట్టి పూరుభర తేశకురు ప్ర భుపాండుభూపతుల్
క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పినయస్మదీయవం
శమునఁ బ్రసిద్ధు లై విమలసద్గుణశోభితులైనపాండవో
త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెమ్మెయిన్. (14)
2. కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు) - ఆదిపర్వం –ప్రథమాశ్వాసము –16 పద్యము
క|| జననుతకృష్ణద్వైపా,
యనమునివృషభాహితమహాభారతబ
ద్ధనిరూపితార్థ మేర్పడఁ
దెనుఁగున రచియింపు మధికధీయుక్తిమెయిన్. (16)
3. వైశంపాయనుడు జనమేజయునికి. – జనమేజయునికి వైశంపాయునుడు చెపుతూంటే రౌమహర్షణి {రోమహర్షణుని (వ్యాసుని శిష్యుడు) తనయుడు} విన్నాడు. అతడు శౌనకాది మునులకు చెప్పాడు. - ఆదిపర్వం – ప్రథమాశ్వాసము – 66 వచనము
వ|| ఇట్టిమహాభారతంబు ననేకవిధపదార్థ ప్రపంచసంచితం నుపపర్వమహాపర్వోప శోభితంబు
నుపద్వీపమహాద్వీపసంభృతం బయినభువనం బజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిల
లోకహితార్థంబు దత్తావధానుం డై సంవత్సర త్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప
నారదుం బనిచెఁ బితృ లోకంబున వక్కాణింప నసితుం డైన దేవలుం బనిచె గరుడగంధర్వయక్షరాక్షస
లోకంబులందు వక్కాణింప శుకుం బనిచె నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచె
మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిం బనిచె నే నావైశంపాయన
మహామునివలన విని వచ్చితిఁ దొల్లి కృతత్రేతావసానసమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబులునుం
బోలె ద్వాపరాంతంబునం బాండవధార్తరాష్ట్రులకు మహాఘోరయుద్ధంబయ్యె నందు. (66)
4. దేవవ్రతుడు – తండ్రి అయిన శంతనునికి సత్యవతిని వివాహం చేయడం కోసం తాను వివాహము చేసుకోనని
భీష్మమయిన ప్రతిజ్ఞ చేయటం వలన, దేవర్షి గణంబులు భీష్ముండని పొగిడిరి, అలా భీష్ముడయ్యాడు. -
ఆదిపర్వం – చతుర్థాశ్వాసము –190 పద్యము& 191 వచనము
క|| ధృతిఁ బూని బ్రహ్మచర్య
వ్రత మున్నతిఁ దాల్చితిని ధృవంబుగ ననప
త్యత యైనను లోకములా
యతిఁ బెక్కులు గలవు నాకు ననుభావ్యములై. (190)
వ|| అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్యపరిత్యాగంబును బ్రహ్మచర్యవ్రత
పరిగ్రహంబును జేసిన దేవవ్రతుసత్యవ్రతంబునకు గురుకార్యధురంధరత్వంబునకు మెచ్చిదేవర్షిగణంబులు
నాతనిపయింబుష్పవృష్టిఁగురిసి భీష్ముం డని పొగడిరి దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతి
నిచ్చె నంత. (191)
5. చెరకు కనుపుల మధ్య రసం చిప్పిల్లినట్లు పర్వాలలో రసం ప్రవహిస్తూ ఉంటుందని; ప్రతిపర్వమురసోదయంగా
ఉంటుందని. పర్వం అంటే కణుపు అని అర్ధం. -
*****
No comments:
Post a Comment