Translate

17 November, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-109

తెలుగు సుద్దులు…..(109)
ఆ.వె|| బ్రహ్మమును యెరుగదు భావమిం`దుం`డెనా
         తనువు గుడిగజేసి తన్ను నిలిపి
         లోకబుద్ధి విడిచి లోజూపు జూడరా
         విశ్వదాభిరామ వినర వేమా!.

భావముః
నాలో ఉన్నది ‘ఆత్మ’బ్రహ్మము వేరు అనే అభిప్రాయము ఉన్నప్పుడు, పరమాత్మ గురించి తెలియదు, తార్కిక జ్ఞానం (ద్వైతం) వదిలి నిన్ను నీవు పరిశీలుంచుకొని, నీ శరీరాన్నే దేవళము చేసి ఆత్మలింగాన్ని అర్చించు. యోగిగా వేమన, శ్రీ శంకర భగవత్పాదుల అద్వైతాన్ని తెలియచెప్పుతున్నారు.||16-11-2014||

No comments:

Post a Comment