ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
కర్ణుని చావుకు కారణాలు ఎవరెవరు?
2.
అర్జునునకు బీభత్సుడనే పేరు ఎందుకు వచ్చింది?
3.
“పరాయణము పరమధర్మపథములకెల్లన్”ఆ పరాయణము ఏది?
4.
పరీక్షిత్తు ఎవరి దగ్గర ధనుర్విద్య నేర్చాడు?
5.
ప్రతి స్మృతి విద్యను వ్యాసుడెందుకు
చెప్పాడు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
౧)బ్రాహ్మణుడు
౨)పరశురాముడు ౩)ఇంద్రుడు ౪)కుంతి ౫)భీష్ముడు ౬)శల్యుడు ౭)కృష్ణుడు ౮)అర్జునుడు ౯)భూదేవి
–
2.బీభత్సంగా యుద్ధం చెయ్యడు కాబట్టి – విరాటపర్వము
– చతుర్థాశ్వాసము – 144పద్యము
నకుర్యాంకర్మ బీభత్సం।
తే॥వీరులకుఁ జూడ బీభత్స విధముగలుగ
నట్టి కార్యంబు సేఁతకు నెట్టిసమర
భంగులను దడఁబడక బీభత్స సేయ
దాన బీభత్సుఁ డనునభిధానమయ్యె.
(144)
3.
ఇతరులు ఏపని చేస్తే తనకు బాధకలుగుతుందో
ఆపని తాన ఇతరులకు చేయకపోవడమే పరమధర్మం. – శాంతిపర్వము – పంచమాశ్వాసము – 220పద్యము
క॥ఒరులేమేని నొనర్చిన
నరవర యప్రియము తనమనంబున కగుఁ దా
నొరులకు నవి చేయ కునికి
పరాయణము పరమధర్మపథముల కెల్లన్.
(220)
4.కృపాచార్యుని దగ్గర – మహాప్రస్థానికపర్వము – 17వచనము
వ॥శేషించిన కాంచనరత్నాదు లాక్షితిపతి పరిక్షితునకుఁ బరమాదరంబున సమర్పించి యతనిం
గృపాచార్యునకు శిష్యుం గా నప్పగించి పౌరజానపదప్రవర జనంబుల రావించి. (17)
5.శత్రు జయంకోసం – ఆరణ్యపర్వము
– ప్రథమాశ్వాసము – 276వచనము
వ॥అని ధర్మతనయు నేకాంతప్రదేశంబునకుం దోడ్కొని చని సత్యవతీసుతుండు విధిదృష్టవిధానంబునం
బ్రతిస్మృతి యనువిద్య నుపదేశించి దీనిశక్తి నర్జునుండధిక తపోవీర్యవిభవుండై యింద్రయమవరుణకుబేరాది
దేవతలను నీశ్వరునిఁ బ్రత్యక్షంబు సేసికొని వారలవలన దివ్యాస్త్రంబులు వడసి శత్రువుల
జయించు… (276)
***********
No comments:
Post a Comment