ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
సుశర్మని చంపినదెవరు? ఎన్నవ రోజున?
2.
యుద్ధం చివరకు మిగిలిన పాండవ సేన ఎంత?
3.
పరీక్షిత్తు అనే పేరు ఎట్లా వచ్చింది?
4.
క్షేమధూర్తి ఎవరు? ఎవరిచేత చనిపోయాడు?
5.
కర్ణునికి సారధ్యం చేయటానికి శల్యుడు
పెట్టిన షరతు ఏది?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
అర్జునుడు 18వరోజున
– శల్యపర్వము – ప్రథమాశ్వాసము – 378 వచనము
& 379 పద్యము
వ॥…..గోవిందపురందర పుత్రులపైఁ బటుప్రదరపరంపరలు పరగించి
విజృంభించిన నవ్విజయుండు. (378)
సీ॥సత్యకర్మునితల్ చారుకుండలపరిస్ఫురితత్వ మొందుచు ధరణి డొల్ల
నేసి మృగంబుపై కెరఁగుసింగమపోలెఁ
గిట్టి సత్యేషుని గీ టడంచి
బహుదినసంచిత ప్రకటకోపానలజ్వాలలు
సాకారలీలఁ బర్వు
తెఱఁగున నరుణదృగ్దీప్తిజాలంబు సుశర్ముపై
నిగిడించి సాయకత్ర
తే॥యంబొడలనాటుటయుఁ దద్రథంబులొక్క
పెట్టఁగవిసిన నన్నిటిఁబిలుకుమార్చి
రథ్యములఁగూల్చి యతనియురంబు ఘోర
భల్లమున వ్రచ్చి నిర్గతప్రాణుఁజేసె. (379)
2.
రధాలు – 2000; ఏనుగులు – 700; గుర్రములు – 5000;
కాల్బలము –
10,000 – శల్యపర్వము – ప్రథమాశ్వాసము – 400 వచనము.
వ॥అట్టియెడ రెండువేలరథంబు లేడునూఱుగజంబు లైదువేలు గుర్రంబులు పదివేలు కాలుమానిసియుఁ
దానును ధృష్టద్యుమ్నుండు సంగరాంగణంబున మెఱసియుండె. (400)
3.
పరిక్షీణమయిన ప్రాణంతో పుట్టాడు గనుక,
తరువాత కృష్ణుడు బ్రతికించాడు. – సౌప్తికపర్వము – ద్వితీయాశ్వాసము
– 86వచనము
వ॥అని పలికి పరమాదరణీయు లగుసాత్యవ తేయ దేవకీనందనులవాక్యంబు లాదరింపక పాందడవసంతానసకలగర్భవిషయంబుగా
నస్త్రప్రమోచనంబు చేసిన నుపలక్షించి వాసుదేవుం డతనితో ని ట్లను ద్రికాల వేది యగునొక్కబ్రాహ్మణుండుపప్లావ్యంబునకు
వచ్చి యుత్తరను జూచి నీపుణ్యంబునఁ బ్రాణంబులు పరీక్షీణంబు లైనపుత్రుండు జనియింపం
గలవాఁ డది కారణంబుగా భవదీయ గర్భస్థునకుఁ బరిక్షిన్నామధేయం బగు నని పలికే నమ్మహాత్మునివచనం
బనృతంబు కానేరదు భవత్కృత్యం బకృతసమంబ యబ్బాలకుండు పాండవవంశకరుండగు నని చెప్పి తనచిత్తంబున
రోషం బావహిల్లుటయు బాలఘాతి వగునీకు నశనంబు దుర్ల భం బై సహాయరహితుండ వై దుర్గంధరక్తంబు
నంగంబు దిగ్ధంబగుచుండ్ మూఁడువేలేండ్లు తిరుగుము నాచేత రక్షితుండై యక్కుమారుండు కృపాచార్యువలన
ధనుర్వేదవిదుం డై సర్వశస్త్రాస్త్రంబులు పడసి బహుసంవత్సరంబులు వసుధఁ బాలింపఁగలవాఁడు…..(86)
4.
కులూత దేశాధీశుడు; భీమునిచేత – కర్ణపర్వము – ప్రథమాశ్వాసము – 77
వచనము & 84 పద్యము
వ॥అమ్మాహావీరు నాలోకించి కులూతదేశాధీశుం డయిన క్షేమధూర్తి నిజబలంబులం బురికొల్పికొని
యేచి త్రోచి యహ్వానంబుచేసి తనకరటిం గొలిపిన నది గిరిగిరిం దాఁకుతెఱమ్గున నతని మాతంగంబునకు
మార్కొనియె నయ్యిరువురు నొండరులపైఁ దోమరస్తోమంబు లడ్రించి యార్చుచు నుద్దండపరాక్రమంబులగు
వేదండంబులపటు ప్రచారంబులు చారుభీషణంబులుగా నొకళ్లొకళ్లం జుట్టుకొనివచ్చుచుం బెనగి.
(77)
మ॥గద చేతన్ గొని దంతి డిగ్గి చని యాకౌంతేయుఁ డవ్వీరును
న్మదమాతంగముఁ గూలవేసినఁ గృపాణస్ఫారదోర్దండుఁ
డై
కదియన్ వచ్చె నతండు నిష్ఠురగదాఘాతంబునం
గూల్చె నే
పు దలిర్పన్ వెస నామరుత్తనయుఁ
డాభూమీశు భూమీశ్వరా. (84)
5.
నేను విచ్చలవిడిగా తోచినట్లు మాట్లాడుతాను
తప్పు పట్టరాదు అని షరతు. - కర్ణపర్వము – ప్రథమాశ్వాసము
– 255 పద్యము
క॥జనవల్లభ యొక సమయము
విను మీతనితోడ నేను విచ్చలవిడిఁ
దోఁ
చినమాట లెల్లనాడుదు
నను నెగ్గులు పట్టకుండినం బొం దొనరున్.
(255)
**********
No comments:
Post a Comment