ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
అర్జునుడు కృష్ణుని కోరుకొనే నాటికి
రాయబారాలు ఏవయనా జరిగాయా?
2.
ధర్మరాజును శపింపబోయిన గాంధారిని వారించిన
దెవరు?
3.
యముడు ధర్మరాజును ధర్మవిషయంలో మూడుసార్లు
పరీక్షించాడు, ఎప్పుడెప్పుడు?
4.
రాయబారానికి ఎందుకు వచ్చావని విదురుడడిగితే
కృష్ణుడే మన్నాడు?
5.
ఇంద్రప్రస్థంలో ధర్మరాజు ఎంతకాలం రాజ్యం
చేశాడు?
------------------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1.ఏవి జరుగలేదు.
2.
వ్యాసుడు – స్త్రీపర్వము
– ప్రథమాశ్వాసము – 150వచనము
వ॥…తదనమ్తరంబ యద్ధరణీవిభుండు ధర్మపుత్రప్రభృతు
లగునయ్యేవుర నుద్దేశించి మీరు గాంధారిం గనుం డని పంచిన నప్పాండవేయులు పద్మనాభపురస్సరంబుగాఁ
జని వినయంబున వినతు లైన నద్దేవి దీవింప నొల్లక యుల్లంబు నిజతనుజులమరణంబునకుం దపంబు
నొంద శాపం బిచ్చునది యై యజాత శత్రు నుద్దేశించిన నత్తెఱఁగు సకలప్రాణిచిత్తవృత్తంబులు
తనదివ్యబోధంబునం దేటపడం గనియెడువాఁడును మనోజవుండును సర్వలోక సంపూజ్యుండును నగు సత్యవతీసూనుం
డెఱింగి తత్క్షణంబ సన్నిహితుం డ్య్యు నఖిలజనంబు లభినందనంబుచేయం గైకొనుచు నక్కోడలిం
జేరి యోహో శపింపకు శమింపు మని పలికి మఱియు ని ట్లనియె.(150)
3. 1.ఆరణ్యపర్వము – యక్షప్రశ్నలు;
ఆరణ్యపర్వము - సప్తమాశ్వాసము –
462పద్యము
మత్తకోకిలము॥ఏను ధర్ముఁడఁ జువ్వె రాజకులేంద్ర సత్యము శౌచమున్
దానముం దపమున్ శమంబును
దాంతియున్ యశముం బరి
జ్ఞానయు క్తియు నాదుమూర్తులు
సమ్మదంబున నిప్డు మ
త్సూను నుత్తమధార్మికున్
నినుఁ జూచువేడుక వచ్చితిన్. (462)
2.మహాప్రస్థానికపర్వము
– కుక్కగావచ్చి; మహాప్రస్థానికపర్వము – ఏకాశ్వాసము – 61పద్యము
సీ॥అట్లతిదృఢనిశ్చయంబుగఁ బలికిన తనపుత్రుఁ గనుఁగొని ధర్ముఁ డధిక
సమ్మోదమును బొంది సారమేయాకృతిఁ
బాసి తా నాత్మరూపంబుఁ దాల్చి
పరమసంభ్రమకృతప్రణతియు నానందభరితుండు
నగునానృపాలుతోడ
నీపుణ్యవృత్తంబు నిర్మల మేధయు నఖిలభూతంబులయందుఁ
గలుగు
తే॥దయయు నాదుచిత్తముఁ బ్రమదమునఁ దేల్చె
వత్స భూలోకమున నిట్టివారుఁ కలరె
తొల్లియును ద్వైతవనమున దోషదూర
మయిననీమనమున తెఱం గరసినాఁడ.
(61)
3.స్వర్గారోహణపర్వము – స్వర్గంలో
తమ్ములను చూపించి; - స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము – 48పద్యము
సీ॥అనియె నప్పుడు ధర్ముఁ డభిరామమూర్తియై వదనవికాసంబు వఱలుచుండ
నరాజవర్యునిఁ జెరంగ నరిగి నిస్సీమగౌరవ పరీక్షింపఁ గంటి
నిన్ను ముమ్మా ఱరణీప్రసంగంబున ద్వైతవనంబునఁ
దగిలి కుక్క
తో వచ్చినప్పుడు దైవతగిరిపొంత ననుజవర్గమువిషయంబు
కాఁగ
తే॥నిప్పు డిచటను జలన మొక్కప్పుడైన
నీదుమది నించుకేనియు లేదు దమము
శమము సత్యంబు మద్గతసారభక్తి
నీకు నగ్గలములు మహనీయచరిత.
(48)
4.చుట్టాల కలహం తీర్చటం ధర్మమని వచ్చాను
– ఉద్యోగపర్వము –
తృతీయాశ్వాసము – 242పద్యము
తే॥చుట్టములలోన నొప్పమి పుట్టినప్పు
డడ్డపడి వారితోడఁ గోట్లాడి యైనఁ
దాని యుడుపంగఁ జొర కున్న వానిఁ
గ్రూర
కర్ముఁ డని చెప్పుదురు కర్మకాండవిదులు.
(242)
5.
ఇరువైమూడు సంవత్సరములు – సభాపర్వము – ద్వితీయాశ్వాసము – 317వచనము
వ॥… ని ట్లింద్రప్రస్థపురంబున నిరువదిమూఁడేఁడులు
రాజ్యంబు సేసి పాండవులు పాపద్యూతపరాజితు లయి. (317)
******************************************************
No comments:
Post a Comment