Translate

07 October, 2015

కవితాభూషణ, విద్వత్కవిశేఖర, కళాప్రపూర్ణ శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు రఛింఛిన “శ్రీ భద్రాద్రిరామ శతకము” (1987)



కవిపరిచయము: 
బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు సాహితీలోకములో సుప్రసిద్ధులు.

శ్రీ శాస్త్రిగారి ఇతర రచనలు:


శ్రీవేంకటేశ్వరశతకము, రాయడు శాస్త్రి యశశ్చంద్రిక, మునిత్రయ చరిత్రము, శంకరవిజయము, మదాలసా విలాసము, ఆంధ్రరాజ్యేందిర, వరదగురు యశోవికాశము, జీమూతవాహన చరిత్రము, శబర శంకర విలాసము, శ్రీనాథతారావళి, పోతన, విద్యారణ్య ఛరిత్రము, ప్రభావతీ ప్రద్యుమ్న వ్యాఖ్యానము, మనుచరిత్ర వ్యాఖ్యానము.

శ్రీ భద్రాద్రిరామశతకము విశేష రచన గురింఛి:

1930 సంవత్సరములో, శ్రీ శాస్త్రిగారి 34 ఏట, శ్రీరామనవమి పర్వదినమున వారి అర్ధాంగి, కవులు గడియకు వందపద్యములు చెప్పుదుమని, దినమునకొక ప్రబంధము రచింతుమని ప్రతిజ్ఞలు చేయుదురుగదా, ఈ పుణ్యదినమున శ్రీరామచంద్రునిపై ఒక శతమును రచింపరాదా అని కోరగా శ్రీశాస్త్రిగారు ఉపవాసములోనే భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! అనే మకుటంతో 98 సీసపద్యములను రచించి, సాయంసమయానికి నీరసముతో కన్నులుతిరిగి పడిపోయిరట.  తదనంతరము, తక్కిన 12 పద్యములను పూర్తిచేసి శ్రీరామచంద్రునకు అర్పించినారని శతకములో ముందు మాటగా (నివేదనము) శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మగారు తెలిపినారు.

బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారికి పాదాభివందనములర్పించుకొంటూ వారి పద్యములను నా ఈ బ్లాగు ద్వారా శతకప్రియులకు అందించుచున్నాను. 

సీ. శ్రీ జానకీమనస్సేవధిపాలక!
           దశరథచిరతపోధర్మఫలమ!
     గాధేెయకష్టసాగరతారణోడుప!
           సౌందర్యజితకోటిజలజబాణ!
     వాలికాదంబినీజాలప్రభంజన!
           హనుమన్మయూరవర్షాభ్ర ఖండ!
     శరభంగముక్తి దాశ్చర్యమంత్రోత్తమ!
           సుగ్రీవదు:ఖసంశోషణార్క!
తే.గీ. నేడు శ్రీరామనవమి నీ నిర్మలాఖ్య
        శతక మొకటి రచించి నీ చరణయుగళి
        నుంచి భవవార్ధి దాట నుహించుచుంటి
        భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (1)


సీ.కారణజన్మ! నిన్నేరీతి “సోఽయ”మ్మ
             టంచు ముందుగ నిర్ణయించు వాఽడ
   నిర్గుణుండవు భవన్నీరంధ్ర సంవిదా
             కృతి నెట్లు తెలిసి వర్ణించు వాఽడ
   సకలచరాచర స్థానుండ వైన నీ
             కిదియ తా వని యెట వెదకు వాఽడ
   నిర్వికల్పుఁడ! యె ట్లణీయమౌ బుద్ధి వే
             దాంతవేద్యుని నిన్ను నరయు వాఁడ
తే.గీ.నబ్ధి కేతాము నెత్తినట్లమితసుగుణ
       నిలయుఁ డైనట్టి ని న్నెట్టు పలుకు వాఁడ
       నా తెగువఁ గాంచి యొక నవ్వు నవ్వుకొందె!
       భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (2)
సీ.గుహఁడు రాతిరిఁ బండుకొనఁ జిగురాకుల
             పానుపు వేసి యర్పణము సేసె
శబరి నిశ్చలభక్తి సరసఫలహార
             ముల తోడ నాతిథ్యమును ఘటించె
నుడుత యథాశక్తినుదధి సేతువుఁ గట్టు
             తఱిఁ దోఁక నిసుము మాత్రమ్మ చల్లె
సంపాతి త్వత్కథాశ్రవణోదితాక్షుఁడై
             సీత చరిత్ర లక్శిఞ్చి చెప్పె
తే.గీ.నట్టులే నేను నాచేత నైన కైత
       వర్ణనము సేయుచుంటి కైవల్య మొందఁ
       జంద్రునకు నూలిప్రోఁ గనుచుంద్రు వినవె?
       భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (3)


సీ. గగన వీథిఁ ద్రిశంకుఁగాఁపు వెట్టిన మౌని
         ని మహత్త్వ  మెఱంగునేర్పు వడసెఁ
     గంటఁ ద్రయీగిరుల్ గనుఁగొన్న ముని నీ య
            మేయప్రభావ మర్మిలి నెఱింగె
      వాతాపిదమనవిఖ్యాతుఁడౌ తపసి నీ
            యనుభావసర్వస్వ మాకళించె
      నీ పుట్టు వెంచి యెన్నియొ తరంబులఁ బురో
            ధనుఁడైన మౌని నీతత్త్వ మరసె
తే.గీ. నంతటి మహనుభావుల కలవి యైన
        నీ మహత్త్వము చెప్పఁగనేర్తు మనుట
        యస్మదాదుల మూఢత్వ మగును గాదె!
        భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (4)


సీ. రామాయణములు నీ నామమహత్వంబు
            చాటు నిత్యంబు నుచ్చావచముగ
     శతకంబులో భవత్సగుణనిర్గుణమూర్తు
            లమితరీతుల నుతు లాచరించు
      నాటకంబులు నీ యనంతకల్యాణగు
            ణంబుల నైద్రియికంబు సేయుఁ
      గావ్యముల్ రసము లొల్కఁగ ని యశంబును
            గానం బొనర్చు వాఙ్మధురిమమున
తే.గీ. నట్టి నీ గుణకీర్తన మాచరింపఁ
        బూను నావంటి యల్పజ్ఞుఁడైన మనుజుఁ
         డే మొనర్పఁగఁ జాలు గ్రహింపు ప్రీతి  
        భద్రగిరిధామ! కరుణాసముద్రరామ! (5)






No comments:

Post a Comment