ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. దుష్టచతుష్టయంలో ఎవరు ఎవరి చేతిలో చనిపోయారు?
2. సత్యసేనుడు ఎవరు? ఎవరి చేత చనిపోయాడు?
3. భీష్ముడు ఎప్పుడు ప్రాణాలు వదిలాడు?
4. ధృతరాష్ట్రునకు భారత యుద్ధం వర్ణించి చెప్పినదెవరు?
5. దేన్ని విడిచి మానవుడు సుఖపడతాడు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
దుశ్శాసనుడు – భీముని
చేతిలో; కర్ణుడు – అర్జుని చేతిలో; శకుని – సహదేవుని
చేతిలో; దుర్యోధనుడు – భీముని చేతిలో.
2.
కర్ణుని కొడుకు – భీముని చేత – కర్ణపర్వము – ద్వితీయాశ్వాసము –
168 పద్యము.
సీ॥కనలి యొండకవిల్లు గొని కీచకాంతకుఁ డక్కుమారునిచాపయష్టి విఱుగ
నేసి మై బల్తూపు లీరేడు నాటించి
త న్నప్డు తొడరురాధాతనూజు
నుబ్బు వాలమ్ములు డెబ్బదిమూఁట
వారించి తత్సుతుఁడు దోర్లీల మెఱయం
జేరిన నాసత్యసేనురథ్యంబుల సూతుఁ
గార్ముకమును గేతనంబు
తే॥నేడు తూపులఁ దునుమాడి యేచి మూఁడు
నారసము లంగమునఁ గ్రుచ్చి నాళమునకు
వికసితాంభోరుహముఁ బాపు వెరవు దోఁపఁ
దునిమె వెసఁ గత్తివాతియమ్మున శిరంబు. (168)
3.
మాఘశుద్ధ ఏకాదశి – దీన్నే
భీష్మ ఏకాదశి అంటారు. –
4.
సంజయుడు – భీష్మపర్వము
– ప్రథమాశ్వాసము – 64 వచనము
వ॥అని పలికి సంజయుకరంబు విడిచి కయ్యం బెయ్యెడం బొడిచిరి పదిదినంబులు నుభయబలంబువారును
నెవ్విధంబున మోహరించి రెవ్వ రెవ్వ రెప్పు డెప్పుడేమి సేసి రిన్నాళ్లు గాంగేయుఁ డెబ్భంగులసంగరంబుసేసెఁ
దుది నెత్తెఱంగునం దెగియె నంతయు వివరించి పరిపాటిం దేటపడం జెప్పుము. (64)
5.
తృష్ణ (కోరిక)
– ఆరణ్యపర్వము –
సప్తమాశ్వాసము – 452పద్యము.
తే॥సర్వజనసమ్మతుండగు గర్వముడిగి
క్రోధమడఁచి శోకమునకుఁ గొలువుగాఁడు
వినవెయర్థాఢ్యుఁడగులోభ మొనరవిడిచి
తృష్ణవర్జించి సౌఖ్యంబు తెరువుఁగాంచు.
(452)
No comments:
Post a Comment