ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
యుద్ధంలో భీముడు కర్ణుని నాలుక కోయబోతే
ఒక వీరుడు వారించాడు, ఎవరా వీరుడు?
2.
యుద్ధంలో సంజయుని పట్టుకొని నరకబోయిన
దెవరు? ఎవరి వల్ల అది తప్పింది?
3.
“ఇందులో ఉన్నదే ఇతరత్ర కనిపిస్తుంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు” ఈ అర్ధం వచ్చే శ్లోకపాదాలు
ఏవి?
4.
యుద్ధం సమయంలో ద్రౌపది ఎక్కడుంది?
5.
దుశ్శాసనుని చంపిన దెవరు? ఎన్నవరోజున?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.శల్యుడు- 1.అర్జునుని
ప్రతిజ్ఞ గుర్తుచేసి 2.అది (మూర్ఛపోయినవాని
నాలుక కోయడం అధర్మమని – కర్ణపర్వము – ద్వితీయాశ్వాసాము – 214
వచనము.
వ॥అప్పు డయ్యనిలతనయుండు తనయరదంబు కదియం దెచ్చి యా సూతనందనుం గనుంగొని యిన్నీచునాలుక
గోసెద ననుచుం గట్టినయలుఁగు పెఱికి యతని యరదంబుమీఁది కరుగ నుత్సహించినంజూచి మద్రవిభుండు
వారించి యిది మూర్ఛగాని మరణంబుగాని మరణంబుకా దీయవస్థ్ నాలుక గోసినణ్ జచ్చు నితని కజంపుటకుఁ
బార్థుండు ప్రతిన పట్టినవాఁడు నీవు చమ్పిన నతండు నెవ్వగఁ బొందు ననిన విని యవ్వీరుండు
వీఁ డిప్పుడు పాండవా గ్రజుని బాధించినం గ్రోధాంధుండనై యది మఱచితిం గాని చావు కామియు
నిత్తియెడ నాలుక గోయం దడవఁ జచ్చుటయు నెఱుంగుది నిత్తెఱంగు నీవు తలంపించి లెస్సచేసి
తిద్దురాత్ముండు సభలోన నసభ్యంబు లగు మాటలు ద్రౌపది నుద్దేశించి యాడిన నుద్దీపించినకోపం
బజాతశత్రునకుఁ బ్రియంబుగా నడంచికొని యుండితి నేఁడు తద్వేదన వెలార్పం జూచితి నట్ల చేసితినేని
మానధనుండైన ధనంజయుండు తన చేసినపూనిక నెఱపంగాక మనంబునం గుంది మడియుఁ గృష్ణయుధిష్ఠిరులు
నాతనితోడివార యింత ప్రమాదంబు నీవు గలిమిం దెలిసితి మే లయ్యె మాతులా నీయాజ్ఞ యుల్లంఘింప
నని పలికి నిలిచె శల్యుండును సంతసిల్లి తేరు తొలంగించె ననుటయు నాంబికేయుండు సంజయున
కి ట్లనియె. (214)
2.సాత్యకి; వ్యాసుడు
– శల్యపర్వము –ద్వితీయాశ్వాసము – 8 వచనము
వ||
ఆశైనేయుండు వాలుపెఱికి వ్రేయం జూచునంతఁ గృష్ణద్వైపాయనుండు సన్నిధిచేసి
యతని వారించి సంజయుం జంపుట యనుచితంబు ముందల విడువుమని యానతిచ్చిన నతండును వినతుం డై
యట్ల కాక యని పలికి నన్ను విడిచెఁ గృష్ణద్వైపాయనుండు మదీయాననం బాలోకించి బ్రదికిపోయి
తెక్కడకైనం బొ మ్మనుటయు నమ్మునీంద్రు వీడ్కొంటి నంత నతఁ డంతర్ధానంబు చేసె నేను దత్ప్రదేశంబు
పాసి నీసుతుండు చనిన చక్కటికిఁ గ్రోశమాత్రంబు పోయి ద్వైపాయనం బనం బ్రసిద్ధం బైన యమ్మడువు
సమీపంబున. (8)
3. యదిహాస్తి తద్నన్యత్ర । యన్నేహాస్తి నతత్ క్వచిత్॥ - దీనికి తిక్కన గారి
తెలుగు పద్యముః
తే॥అమల ధర్మార్థకామమోక్షముల గుఱిచి
యొలయు తెరు వెద్దియును నిందుఁ గలుగు
నదియు
యొండెడలఁ గల్గు దీన లే కుండు చొప్పు
దక్కొ కండును లేదు వేదజ్ఞులార!
-
స్వర్గా రోహణ పర్వము – 82 పద్యము
4.
ఉపప్లావ్యంలో – ఉపపాండవులు,
తండ్రి, సోదరులు అశ్వత్థామచే చంపబడినపుడు కురుక్షేత్రానికి
వస్తుంది – సౌప్తికపర్వము – ద్వితీయాశ్వాసము – 20వచనము.
వ॥…యన్నరనాథుండునకులుం గనుంగొని
యతిత్వరితగమనంబునకు దగురథంబునం జటులంబులైన రథ్యంబులం బూన్చికొని యుపప్లావ్యంబునకుం
జని ద్రుపదనందనను దక్కును మనదెసం గలుగునంగనలను ద్రుపదమత్స్యపతిపక్షంబు భామలను దోడ్కొని
యవ్విడిదలకుం జనుదెమ్మని చెప్పి యేము నయ్యెడకుం జనుదెంచెద మనుటయు నతండుతదుక్తప్రకారంబునం
జనియెనజ్జనవల్లభుండు తక్కటితమ్ములునుదామోదర సాత్యకులును నడలుచుఁ దన్నుం బొదివికొని
చనఁ గౌరవశిబిరంబునం గల జనంబులు కొల్చి పోవ నేడ్చుచు నిజశిబిరంబునకుం బోయి తత్ప్రదేశంబున.
(20)
5.భీముడు – 17వ
రోజున – కర్ణపర్వము –తృతీయాశ్వాసము – 214&
227 పద్యము
మ॥నరసింహుం డసురేంద్రు వ్రచ్చుకరణిన్ రౌద్రం బుదగ్రంబు గా
నుర మత్యుగ్రతఁ జీరి క్రమ్మురుధిర మ్ముల్లాసి యై దోయిటన్
వెర వారమ్ గొని త్రావు మెచ్చుఁ జవికి న్మేనున్ మొగంబున్ భయం
కర రేఖం బొరయంగఁ జల్లికొను నక్కౌరవ్యుఁ జూచుం బొరిన్. (214)
క||జనపతియుఁ గృపప్రముఖులుఁ
గనుఁగొన ని ట్లనిలసుతుఁడు గ్రౌర్య
మొడల్ గై
కొనినట్లు పేర్చి దుశ్శా
సనుఁ జంపుటఁ జూచి రోషసంరంభమునన్.
(227)
********
No comments:
Post a Comment