ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. కృష్ణార్జును లిరువురూ రధికులై యుద్ధం చేసిన ఘట్టం ఏది?
2. తెలుగు భారతంలో మిక్కిలి చిన్న పర్వం
ఏది?
3. తిక్కన వ్యాసస్తుతి పద్యాన్ని పోతన తన
యిష్టదేవతా ప్రార్ధనలో చేర్చుకున్నాడు.
ఆ పద్య సందర్భమేమిటి?
4.ఉత్తరాకుమారు డెవరు?
5.ధర్మరాజు రాజయ్యాక యువరాజెవరు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1.ఖాండవ వన దహన ఘట్టము – ఆదిపర్వము – అష్టమాశ్వాసము –
2.
మహాప్రస్థానికపర్వము – ఏకాశ్వాసము –80పద్యములు, వచనములు
3. సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధాన్ని
వర్ణించి చెప్పే ముందు వ్యాసులవారిని భావిస్తాడు. – భీష్మపర్వము –ప్రథమాశ్వాసము – 71పద్యము
ఉ॥ప్రాంశుఁ బయోద నీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశుజటాచ్ఛటాభరణు నాగమపుంజపదార్థతత్త్వని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మకృతాంబరకృత్యు
భారతీ
వంశవివర్ధనుం ద్రిదశవందితు సాత్యవతేయుఁ
గొల్చెదన్.(71)
4.పరీక్షిత్తు – సౌప్తికపర్వము – ద్వితీయాశ్వాసము – 86వచనము
వ॥అని పలికి పరమాదరణీయు లగుసాత్యవ తేయ దేవకీనందనులవాక్యంబు లాదరింపక పాందడవసంతానసకలగర్భవిషయంబుగా
నస్త్రప్రమోచనంబు చేసిన నుపలక్షించి వాసుదేవుం డతనితో ని ట్లను ద్రికాల వేది యగునొక్కబ్రాహ్మణుండుపప్లావ్యంబునకు
వచ్చి యుత్తరను జూచి నీపుణ్యంబునఁ బ్రాణంబులు పరీక్షీణంబు లైనపుత్రుండు జనియింపం గలవాఁ
డది కారణంబుగా భవదీయ గర్భస్థునకుఁ బరిక్షిన్నామధేయం బగు నని పలికే నమ్మహాత్మునివచనం
బనృతంబు కానేరదు భవత్కృత్యం బకృతసమంబ యబ్బాలకుండు పాండవవంశకరుండగు నని చెప్పి తనచిత్తంబున
రోషం బావహిల్లుటయు బాలఘాతి వగునీకు నశనంబు దుర్ల భం బై సహాయరహితుండ వై దుర్గంధరక్తంబు
నంగంబు దిగ్ధంబగుచుండ్ మూఁడువేలేండ్లు తిరుగుము నాచేత రక్షితుండై యక్కుమారుండు కృపాచార్యువలన
ధనుర్వేదవిదుం డై సర్వశస్త్రాస్త్రంబులు పడసి బహుసంవత్సరంబులు వసుధఁ బాలింపఁగలవాఁడు…..(86)
5.భీముడు – శాంతిపర్వము – ప్రథమాశ్వాసము – 378 వచనము.
వ॥…..యువరాజపదంబున భీమసేను నిలిపి
కర్తవ్యవిచారంబునకుం దదీయనిశ్చయంబునకును సంధివిగ్రహాదిషాద్గణ్యచింతనంబునకు విదురునింబ్రియవచనపూర్వకంబుగా
నియోగించి… (378)
*********************************************************
No comments:
Post a Comment