ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. ధర్మరాజుకు ధర్మవిశేషాలు చెప్పమంటూ అంపశయ్య
మీదనున్న భీష్మునికి కృష్ణుడు మూడు వరాలిచ్చాడు. అవి ఏవి?
2.
మహాప్రస్థానం అంటే ఏమిటి?
3.
ఆరణ్యవాసం చేసే పాండవులను కృష్ణుడు ఎన్నిసార్లు
దర్శించాడు?
4. కర్ణుని కొడుకులెంతమంది? ఎవరు?
5.
ధృతరాష్ట్రుడు వానప్రస్థాశ్రమంలో ఎన్నాళ్లు
ఉన్నాడు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
౧.శరవేదన లేకుండునట్లు
౨.ఆకలిదప్పులు లేని శక్తి కలుగునట్లు ౩.పొరబడని బుద్ధితో దివ్యబోధకలుగునట్లు – శాంతిపర్వము – ద్వితీయాశ్వాసము – 120 - 123 పద్యములు
క॥కురువంశధురంధరుఁ డగు
పరమార్ధజ్ఞాన వినయఫణితిం దగ ని
ర్భరశరవేదన చెప్పితి
వరములు మూఁ డిత్తుఁ గొనుము వసుధాధీశా.
(120)
క॥శరములవలనను మూర్ఛం
బొరయక యొక్కింతడప్పిఁ బొరయక నొప్పిం
బొరయక యవిద్ధగాత్రుని
కరణి సుఖాత్ముఁడవు కమ్ము కౌరవనాథా.
(121)
ఆ॥అనఘ నీరువట్టు నాఁకలియును నెప్డుఁ
బొరయ కుండునట్టి భూరిశ క్తి
నీకుఁ గలుగ నేను నెమ్మనంబునఁ దలం
చితిఁ దదీయపీడఁ జెంద కుండు.
(122)
క॥విను సకలభూతములవ
ర్తనములు కనునపుడు బుద్ధి తవులఁ
బడక యెం
దును బరఁగి దివ్యబోధం
బున నలవడునట్టిపెంపుఁ బొందు మనింద్యా.
(123)
2.
ప్రస్థానం అంటే ప్రయాణం – మహాప్రస్థానం అంటే చివరి ప్రయాణం అని అర్ధం. –
3.
మూడుసార్లు –
౧.
అరణ్యవాసానికి వచ్చిన పాండవులనూ ద్రౌపదినీ ఓదార్చటానికి
౨.
పాశుపతం సంపాదించి నందుకు అర్జునుని అభినందించటానికి – అపుడే సత్యభామకు
ద్రౌపది చేత నీతులు
చెప్పిస్తాడు
౩. దుర్వాసుని
నుండి పాండవులను రక్షించటానికి
4.
అయిదుగురు – ౧.
సుషేణుడు ౨. సత్యసేనుడు ౩. వృషసేనుడు ౪. చిత్రసేనుడు ౫.సుశర్ముడు
– మొదటి ఇద్దరూ
కర్ణుని చక్రరక్షకులు.
5. మూడు సంవత్సరములు – ఆశ్రమవాసపర్వము – ద్వితీయాశ్వాసము –
173 వచనము
వ॥……అమ్మునీంద్రుఁని దక్కునుం గలుగు
తపస్విసత్తముల సమర్చితులం గావించి యుధిష్ఠిరుం డామంత్రితులం జేసిన నా సంయమివరులు నిజనివాసంబులకుం
జని రానృపకుంజరుండు బంధుమిత్రసహితుం డై కుంజరపురంబు ప్రవేశించె నిత్తెఱంగున నాంబికేయునకు
భారతరణంబు పిదప దానాదిపుణ్య్క్రియాకలాప కరణంబులం బురంబునం బదియేనును దపోనియమంబున వనంబున
మూఁడునుంగా బదునెనిమిదిసంవత్సరంబులు చనియె నవ్విధంబున వైచిత్రవీర్యుని సంసేవన సమస్త
ప్రకారంబుల సంఘటించి కృతార్థాతానందంబు నొంది ధర్మనందనుండు జనంబు లభినందించు చందంబున
సామ్రాజ్యంబుఁ బాలించె నని యిట్లు ధృతరాష్ట్రుని యాశ్రమవాసంబువిషయం బైనవర్తనంబు వైశంపాయనుండు
చెప్పిన విని జనమేజయుండు….(173)
No comments:
Post a Comment