ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
అర్జునునకు పాశుపతాది దివ్యాస్త్రములు
కలిగినట్లు ధృతరాష్ట్రునకు చెప్పినదెవరు?
2.
సాల్వుదు ఎవరి చేత చంపబడ్డాడు?
3.
కలియుగ సంవత్సరాలు ఎన్ని?
4.
అశ్వత్థామ వ్యాసుని ఏమని శపించాడు?
5.
తెలుగు భారతంలో కొన్ని పర్వాలు ఒకే ఆశ్వాసంతో
ముగిశాయి? ఆ పర్వాలెన్ని? ఏవి?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.వ్యాసమహర్షి –
2. సాత్యకి – శల్యపర్వము
– ప్రథమాశ్వాసము – 321పద్యము
క॥ఆలోనన శినివరుఁడు వి
శాలాస్యప్రదరనిహతి సాల్వునిశిర
మా
భీలముగఁ ద్రుంప నాతఁడు
కూలిన మనమూఁక విచ్చెఁ గురువంశనిధీ.
(321)
3.కలియుగము-4,32,000 సంవత్సరములు; కృత యుగము-17,28,000;
త్రేతాయుగము-12,96,000; ద్వాపరయుగము –
8,64,000 సంవత్సరములు – శాంతిపర్వము – పంచమాశ్వాసము – 47వచనము
వ॥ఇట్లు కృతయుగంబునకుఁ బదియేడులక్షలు నిరువదియెనిమిదివేలును ద్రేతాయుగంబునకుఁ
బండ్రెండులక్షలుఁ దొంబదియాఱువేలును ద్వాపరంబునకు నెనిమిదిలక్షలునలువదినాలుగువేలును
కలియుఅగంబునకు నాలుగులక్షలు ముప్పది రెందువేలును మనుష్యవత్సరంబు లయ్యె నిందులోన సంధ్యలును
సంధ్యాంశంబులు నను పేళ్లఁ గొంతేసికాలంబు చెల్లు. (47)
4.‘నీవు మనుజులలోనే ఉంటావని’-
కృష్ణుడు పెట్టిన శాపాన్ని ధ్రువపరచి వ్యాసుడు అశ్వత్థామను “నీచకర్ముడా పో!” అన్నాడు. అపుడు అశ్వత్థామ ఈ విధంగా ప్రతిశాపం
పెట్టి నీ దగ్గరే నేనూ ఉంటాను అన్నాడు. – సౌప్తికపర్వము – ద్వితీయాశ్వాసము - 88 వచనము
వ॥అని యిట్లు శపియించి నీచకర్ముండ పొమ్మనిన విని యశ్వత్థామ యమ్మహాత్ముని యననం
బాలోకించి మునీంద్రా నీవు మనుజులలోనన యుండువాఁడ వని ప్రతిశపం బిచ్చి నీకడన యేను వర్తిల్లఁగలవాడ
నీవును శౌరియు సత్యవాదులగుదురుగాక యని తనశిరోమణిపాండవులకిచ్చితపోవనంబునకుం జనియెఁ బాండవులును
గృష్ణుండును నమ్మునీంద్రునకు నమస్కరించి వీడ్కొని యతిత్వరిత గతి నరుగుదెంచి.
(88)
5.
మూడు – మౌసల,
మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు
***********
No comments:
Post a Comment