ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
ధర్మరాజు సత్యం విడువ డని దుర్యోధనునకు
కూడా నమ్మకం - దీనికి ఉదాహరణం ఏమిటి?
2.ధృతరాష్ట్రుని వనవాసానికి పౌరుల సమ్మతిని
తెలిపినది ఎవరు?
3.
కృష్ణుడు అశ్వత్థామను ఏమని శపించాడు?
4.ధృష్టద్యుమ్నునికి మరో పేరు ఉంది,
అదేమి?
5.ఉద్యోగం అంటే ఏమిటి? ఉద్యోగపర్వం అనే పేరు ఎందుకు వచ్చింది
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1.
భీష్ముడు చెప్పినా నమ్మక దుర్యోధనుడు
ధర్మరాజు దగ్గరకు అజ్ఞాతవాసం చెడిపోయిందని దూతను పంపాడు. అపుడే ధర్మరాజు “నిండె సమయాబ్దములు నిండె నిండె” అని ముమ్మారు నిండినట్లు చెపుతాడు.
–
విరాటపర్వము – పంచమాశ్వాసము –
367 వచనము; 368- 370 పద్యములు
వ॥….. గాంగేయునివచనంబు లప్రమాణంబులు
సేసి ధర్మతనయుం డసత్యంబున కియ్యకొనమి యెఱింగి యాతనిపాలికి దూతం బుత్తెంచిన వాఁడు నేతెంచి
కాంచి యిట్లనియె. (367)
తే॥వాలి యజ్ఞాతవాససంవత్సరంబు
నిండ కుండంగ మున్నపార్థుండు బయలు
మెఱసి సమయంబు దప్పె నీ వెఱిఁగి దీని
కేది దగు నది సేయుము మేదినీశ. (368)
వ॥అని పునర్వనవాసకరణంబు దోఁప నాడిన నవ్వి యధిష్ఠితసత్యవ్రతుం డ్యిన యుధిష్ఠిరుం డతని కి ట్లనియె. (369)
క॥నిండె సమయాబ్దములు నిం
కొం డన లే దిపుడ చని సుయోగధనుతో భీ
ష్ముండును గురుఁడును వినఁగా
నిండె ననుము నిండె నిండె నిక్కంబునకున్. (370)
2.శంభువనే విప్రుడు – ఆశ్రమవాసపర్వము
– ప్రథమాశ్వాసము -97 వచనము
వ॥అట్లేడ్చి యుడిగి తమయంతవట్టునుం గూడుకొని కార్యవచనంబు లార్యచరితుండును జాతురాలాపకల్యుండును
నగు శంబువను విప్రోత్తమునకుం జెప్పి యిత్తెఱంగున ధృతతరాష్ట్రునితో నాడు మని నియోగించిన
నాతం డారాజు నగ్ర భాగంబునఁజేరి సవినయంబుగా ని ట్లనియె. (97)
3.నీవు బాలఘాతివి అయ్యావు – “అన్నం దొరకక అసహాయుడవై దుర్గంధ రక్తంలొ శరీరం తడుస్తూ మూడువేల ఏళ్ళు తిరుగుతావు”అని శపించాడు, దీన్ని వ్యాసుడు కూడా ధ్రువీకరించాడు.
–
సౌప్తికపర్వము –ద్వితీయాశ్వాసము – 86
వచనము
వ॥… తనచిత్తంబున రోషం బావహిల్లుటయు
బాలఘాతి వగునీకు నశనంబు దుర్ల భం బై సహాయరహితుండ వై దుర్గంధరక్తంబు నంగంబు దిగ్ధం బగుచుండ
మూఁడువేలేండ్లు తిరుగుము నాచేత రక్షితుండై యక్కుమారుండు కృపాచార్యువలన ధనుర్వేదవిదుం
డై సర్వశస్త్రాస్త్రంబులు పడసి బహుసంవత్సరంబులు వసుధఁ బాలింపఁగలవాడు వానికి జనమేజయుం
డనుమహారాజు ప్రభవించి నీవు చూచుచుండ నుజ్జ్వలుం డై ప్రవర్తించు మదీయంబు లగుతపస్సత్యంబులమహనీయప్రభావంబులు
చూడు మని యాడె నప్పుడు కృష్ణద్వైపాయనుండు గురునందనున కి ట్లనియె. (86)
4.శ్వేతుడు - 5.ప్రయత్నం – సంధికోసం ప్రయత్నాలు సాగిన పర్వము కనుక. ******************************************************************
No comments:
Post a Comment