ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
హస్తినాపురంలో ధర్మరాజు ఎంతకాలం రాజ్యం
చేశాడు?
2.
“కృతఘ్నని పీనుగును కుక్కలు కూడా ముట్టవు” ఈ మాటలు ఎవరన్నారు? ఎవరితో?
3.
తెలుగు భారతంలోని పద్యాల సంఖ్య సుమారుగా
ఎంత?
4.
మహాప్రస్థానంలో భీముని పతనానికి కారణం
ఏమిటి?
5.
యుద్ధానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడు
కాబోయే ముందు ఒకరు ధర్మజుని నిందించాడు, ఎవరాతడు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1.
36 సంవత్సరములు – మౌసలపర్వము – ఏకాశ్వాసము – 3పద్యము
సీ॥భారతసంగ్రామపారీణుఁ డై జయరమ యుల్లసిల్ల సామ్రాజ్యమునకుఁ
బాండవముఖ్యునిఁ బట్టంబు కట్టినయది
యాది కాఁగ ముప్పదియు నైదు
సంవత్సరంబులు చన ననంతరవత్సరంబునఁ
బ్రజకు భయం బొనర్చు
నుత్పాతములు పుట్టె నుర్వీశ విను
మహావాయువు శర్కరావర్షి యగుచు
ఆ॥వీచు నర్కునుదయవేళల బింబంబు
బలసి తోఁచు ఘనకబంధసమితి
నీరదములు లేక నిర్ఘాతపాతముల్
కలుగు నుల్క లెల్లకడల డుల్లు.
(3)
2.
విదురుడు ధృతరాష్ట్రునితో – ఒకరివల్ల సంపదపొంది వారికే కీడు చేసిన కృతఘ్నుని పీనుగును కుక్కలు కూడా ముట్టుకోవు
– (కుక్కలు విశ్వాసం కలవి). పాండురాజు వల్ల ఈ రాజ్యం విస్తరిల్లింది. వారిది అసలీ రాజ్యం. అతని కొడుకులకు రాజ్యం ఇవ్వకపోవడం
కృతఘ్నత అని విదురుని భాషణం. – ఉద్యోగపర్వము – ద్వితీయశ్వాసము – 77పద్యము
చ॥ఒకరునిచేతప్రోవును దదున్నతిప్రాపును గాంచి యెల్ల వెం
టకును గొఱంత లేక పొగడం దగుసంపద
నొంది యట్టిదా
తకుఁ దుదిఁ గీడు సేసినకృతఘ్నునిపీనుఁగు
నైన రోఁత పు
ట్టక కబళింపఁ గుక్కలు నొడంబడునే
కురువంశవర్ధనా. (77)
3.
21,567 - 4.౧.అతిగా భుజించడం ౨.ఎవరినీ లెక్క చేయక గర్వోక్తులు పలకడం - మహాప్రస్థానికపర్వము – ఏకాశ్వాసము –44పద్యము
చ॥అన విని యాతఁ డిట్లనియె నాతనితో భవదీయ మైనభో
జన మతిమాత్ర ముద్ధతిఁ బ్రచండుఁడ
వై భుజశక్తి నెవ్వరిం
గొనక కడంగి రజ్జుపలుకుల్ కడుఁ బెక్కులు
పల్కు దెప్డు నీ
వనుపమశౌర్య యిప్పడుత కత్తెఁఱగుల్
కత మెల్లఁ జెప్పితిన్. (44)
వ॥… రట్టియెడ దుర్యోధనసఖుండైనచార్వాకుం
డనునొక్కరక్కసుండు విప్రాకారంబు గైకొని త్రిదండివేషంబలవడ నయ్యవనీదేవతాకోటిలో నిల్చి
యన్నరనాథున కి ట్లనియె. (360)
`చ॥వినుము నరేంద్ర సర్వ మగువిప్రజనంబును గూడి నన్నుఁ బం
చినవిధ మీతఁ డేటిపతి చేసినపపము
పెద్ద చంపుచో
జనకుఁడు భ్రాత పుత్రుఁ డనుశంక యొంకించుక
లేదు సద్గురుం
డనియెడికొంకు బుద్ధి నిసుమంతయు
బుట్టదు వీనిఁ గాల్పనే.. (361)
ఆ॥ఇట్లు శిష్టజనము లేవగింపఁగఁ జేయు
రాజ్య మేల బంధురాజి నెల్లఁ
బొలియఁ జేసి యెట్టి భోగంబు లనుభవిం
చెదవు కల్మషంబు చిక్కె నీకు.
(363)
******************************************************************************
No comments:
Post a Comment