Translate

16 October, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 107 (531-535)



ఓం గణేశాయనమః గురుభ్యోనమః  
 __/\__
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. శిశుపాలుని కొడుకు ఎవరు?
2.దుష్టచతుష్టయంలో ఇద్దరొక రోజున మరొక యిద్దరు ఒకరోజున చనిపోయారు ఎవరెవ రే రోజుల్లొ?
3.ఒడిచి తలపట్టి తిగిచి .. గొంకు కొసరించుకయు లేక కూలఁదాచె. ద్రౌపదిని ఈ పనిచేసినదెవరు? ఎక్కడ?
4.భీముని ధ్వజం ఏమిటి??
5. బభ్రువాహనుని తల్లి దండ్రులెవరు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. ధృష్టకేతుడు ఇతడు పాండవ పక్షంలో అక్షౌణి సైన్యంతో వచ్చి చేరాడు. విరాటపర్వము చతుర్థాశ్వాసము – 109పద్యము
సీ||పటుపరాక్రమనిధి పాంచాలపతియు నమానుశతేజుండు మత్సవిభుఁడు
   శత్రుభీకరమూర్తి సాత్యకియును జరాసంథాగ్రతనయుండు శౌర్యఘనుఁడు
   సహదేవుఁడును ధైర్యశాలి యాదవశిరోమణి చేకితానుండు మహితవిభవ
   ఖని యగుశిశుపాలతనయుండు దోర్దర్పధుర్యుండు ధృష్టకేతుండు సమర
తే।।లంపటుండు శిఖండియు లావు వెరవుఁ
     గలరు నీయెడ ననురక్తి గలరు సాలఁ
     బెంపు గలరుక్కు ముట్టిన తెంపు గలరు
     కోరి పతులుగఁజేయు మక్షోహిణులకు. (109)
2.  () 17వ రోజు దుశ్శాసనుడు, కర్ణుడు కర్ణపర్వము - తృతీయాశ్వాసము 214& 227 పద్యము; 366 పద్యము
నరసింహుం డసురేంద్రు వ్రచ్చుకరణిన్ రౌద్రం బుదగ్రంబు గా
     నుర మత్యుగ్రతఁ జీరి క్రమ్మురుధిర మ్ముల్లాసి యై దోయిటన్
     వెర వారమ్ గొని త్రావు మెచ్చుఁ జవికి న్మేనున్ మొగంబున్ భయం
     కర రేఖం బొరయంగఁ జల్లికొను నక్కౌరవ్యుఁ జూచుం బొరిన్.  (214)
జనపతియుఁ గృపప్రముఖులుఁ
    గనుఁగొన ని ట్లనిలసుతుఁడు గ్రౌర్య మొడల్ గై
    కొనినట్లు పేర్చి దుశ్శా
    సనుఁ జంపుటఁ జూచి రోషసంరంభమునన్. (227)
తేదారుణాస్త్రజాలాంశుల వైరిసైన్య
    తాప మొనరించి యాసూతతనయతరణి
    పార్థదుస్తరకాలవైభవము గడవ
    ననువు లేమి నవ్విధమున నస్తమించె. (366)
() 18వరోజు శకుని, దుర్యోధనుడు శల్యపర్వము ప్రథమాశ్వాసము – 396&397 పద్యములు; ద్వితీయాశ్వా
తురగములు సిడము గొడుగును
    శరాసనముఁ దునిమి యార్వ సాహసమునని
    ష్ఠురశక్తిఁ బూన్చె నాతని
    యురఃస్థలము వైవ శకుని యుర్వీనాథా. (396)
సహదేవుం డది శాతభల్లమున నుత్సాహోగ్రుఁ డై త్రుంచి దు
       స్సహభల్లద్వితయంబునం గరయుగ స్వైరచ్ఛిదాకేళి స
       ల్పి హసద్వక్త్రవిలాస మొ ప్పెసఁగ నాభీలద్యుతిస్ఫారభ
       ల్లహతిం గంఠము త్రుంప మస్తకము డొల్లన్ డొల్లె మేనున్ మహిన్. (397)
అప్పుడుమహోల్కాపాతంబులును బాంసుమాంసరక్తవర్షంబులును వికృతంబులగు కరితురగబృంహిత హేషాఘోషంబులును మఱియు ననేకోత్పతంబులును గలిగిన నట్లు కౌరవపతి పడుటకు నుబ్బునం బొదలినపాంచాలురం బాండవులు నుద్విగ్నచిత్తు లైరి వియత్తలం బంతయు నొక్క మ్రోతఁగా నగ్గదాయుద్ధ విశేషంబు లగ్గించుచు సురగరుడఖచరాదులు నిజస్థానంబులకుం జని రిట్లు తన గద తాఁకునఁ దొడలు విఱిగి సింగంబుచేతం గూలినగంధశుండాలంబు చందంబునం బడియున్ననీకొడుకుం జేరం జని భీమసేనుండు. (277)
3.  సింహబలుడు - విరాటుని సభలో- విరాటపర్వము ద్వితీయాశ్వాసము – 128పద్యము
తేసింహబలుఁ డత్యుదగ్రతఁ జిగురుబోఁడి
     పజ్జఁ గడువడిఁ దగిలి కోపంబు గదుర
     నొడిచి తలపట్టి తిగిచి మహోగ్రవృత్తిఁ
     గొంకు కొస రించుకయు లేక కూలఁ దాచె. (128) 
4.  సింహం -
5.చిత్రాంగద అర్జునుడు -
******************************************************************************

No comments:

Post a Comment