ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1.
భారత కథను నాటకాలుగా తెలుగులో వ్రాసినదెవరు?
2.మహాప్రస్థానంలో నకులుని పాటుకు కారణం
ఏమటి?
3.భారతంలో 18 పర్వలు
మళ్ళీ మూడు భాగాలుగా విభజిస్తారు, అవి ఏవి?
4.ధర్మజుని యాగాన్ని నిందించిన ముంగిస
పూర్వం ఎవరు? ఎవరి శాపం వల్ల ముంగిస అయ్యాడు?
5. భీష్ముడంపశయ్య మీద ఎంతకాలం ఉన్నాడు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1.
తిరుపతి వేంకట కవులు – శ్రీ
దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు మరియు శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు 2.తాను చాలా అందగాడనని గర్వం - మహాప్రస్థానికపర్వము – ఏకాశ్వాసము –39పద్యము
తే॥డతని కి ట్లను నీతండు నాత్మసదృశుఁ
డఖిలజగముల లే డు రూపాతిశయము
తనక కల దని యెపుడుఁ జిత్తమునఁ దలఁచు
నయ్యహంకృతినిట్టికీడయ్యెఁజువ్వె.
(39)
3. ఆది పంచకము – 5 – ఆది,
సభా, ఆరణ్య, విరాట,
ఉద్యోగ పర్వములు
యుద్ధషట్కము – 6 - భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వములు
శాంతి సప్తకము –7 – శాంతి,
ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస,
మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ
పర్వములు
4.జమదగ్ని – పిత్రుదేవతల
శాపం వల్ల. – అశ్వమేధపర్వము – చతుర్థాశ్వాసము – 272 పద్యము 5. 42రోజులు – ఆనుశాసనికపర్వము – పంచమాశ్వాసము - మాఘమాసము శుక్లపక్షము
******************************************************************************
No comments:
Post a Comment