ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం
వ్యాసం – తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల
రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]
1. మహారథుడంటే ఏమిటి?
2.ద్రౌపది అధర్మవిజిత అని నిర్భయంగా సభలో
చెప్పినది ఎవరు?
3.తిక్కన భారతానికి వ్రాయస కాడొకడున్నాడని
అంటారు, ఎవరాతడు?
4.ఇరావంతు డెవరు?
5.భారత యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడెన్నాళ్లు
బ్రతికాడు?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు
(జవాబులు):
1.
11 వేలమందితో యుద్ధం చేయగల ధనుర్విద్యావేత్త.
-
ఏకాదశ సహస్రాణి యోధయేత్ యస్తు ధన్వినాం
శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ సవిజ్ఞేయో
మహారథః॥
2.వికర్ణుడు – సభాపర్వము – ద్వితీయాశ్వాసము –
227 వచనము
వ॥ ఇక్కురువృద్ధు లైనభీష్మధృతరాష్ట్రవిదురాదులును నాచార్యు
లయినద్రోణకృపాదులుం బలుకరైరి యున్నసభాసదు లెల్లం గామక్రోధాదులు దక్కి విచారించి చెప్పుం
డనిన నెవ్వరుం బలుక కున్న నే నిందు ధర్మనిర్ణయంబు సేసెద నెల్లవారును వినుండు జూదంబును
వేఁటముఁ బానంబును బహుభక్షణాసక్తియు ననునాలుగు దుర్వ్యసనంబులం దగిలినపురుషుండు ధర్మువుం
దప్పి వర్తిల్లునట్టివానికృత్యంబులు సేకొనందగవు కితవాహూతుం డై వ్యసనవర్తియయి పరాజితుం
డయినపాండవాగ్రజుండు పాండవుల కందఱకు సాధరణ ధనంబయినపాంచాలిఁ బణంబుఁ జేసెం గావున ద్రౌపది
యధర్మవిజిత యక్కోమలి నేకవస్త్ర నిట దోడ్కొనితెచ్చుట యన్యాయం బనిన వికర్ణుపలుకుల కొడంబడక
కర్ణుండు వాని కి ట్లనియె. (227)
3.గురునాథుడు –
4. అర్జునుడు – ఉలూచి,
వీరి పుత్రుడు ఇరావంతుడు – ఆదిపర్వము -
అష్టమాశ్వాసము – 130 – 134 వచనము
వ॥ఏ నులూచి యనునాగకన్యక నై రావతకులసంభవుం డయినకౌరవ్యుకూతుర నిన్నుం జూచి మనోజబాణబాధిత
నయితి నామనోరథంబు సలుపుము. (130)
వ॥అనిన నవనతానన యయి నాగకన్యక యర్జునుం జూచి ద్రుపదరాజపుత్రియందు మీ చేసినసమయంబును
భవత్తీర్థాగమనవ్రత నిమియత్తంబును నెఱుంగని దానఁగాను సర్వతీర్థసేవనంబును సర్వవ్రతంబులు
సలుపుటయును సర్వదన ధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు నామనోరథంబు విఫలం బయిన
మనోజనలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము దీన నీకు వ్రతభంగంబు గా దనిన
నర్జునుండు దాని మనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు
(సద్యోగర్భంబున) నిరవంతుం డను కొడుకుం బడసి నాగలోకంబు
వెలువడి యాదిత్యొదయమ్బు తోడన గంగాద్వారంబునకు వచ్చి తద్వృత్తాతం బంతయుఁ దనసహాయులయినవిప్రులకుం
జెప్పి వారలకు హృదయానందంబు సేయుచు. (134)
5.
పదునెనిమిది సంవత్సరములు; 15
సంవత్సరములు హస్తినలో, 3 సంవత్సరములు వానప్రస్థాశ్రంమంలో
– ఆశ్రమవాసపర్వము – ద్వితీయాశ్వాసము –
173వచనము
వ॥….నిత్తెఱంగున నాంబికేయునకు భారతరణంబు
పిదప దానాదిపుణ్యక్రియాకలాప కరణంబులం బురంబునం బదియేనును దపోనియమంబున వనంబున మూఁడునుంగా
బదునెనిమిదిసంవత్సరంబులు చనియె నవ్విధంబున వైచిత్రవీర్యుని సంసేవన సమస్తప్రకారంబుల
సంఘటించి కృతార్థతానందంబు నొంది ధర్మనందనుండు జనంబు లభినందించు చందంబున సామ్రాజ్యంబుఁ
బాలించె నని యిట్లు ధృతరాష్ట్రుని యాశ్రమవాసంబువిషయం బైనవర్తనంబు వైశంపాయనుండు చెప్పిన
విని జనమేజయుండు….. (173)
*****************************************************************************
No comments:
Post a Comment