Translate

11 October, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి – 95 (471- 475)



 ఓం గణేశాయనమః గురుభ్యోనమః  

 __/\__
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్||
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి గారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారముగా.]



1.     ధర్మరాజు అశ్వమేధంలో యాగాశ్వ రక్షణకు ఎవరు వెళ్లారు?
2.    ఎప్పుడూ ఒంటరిగా తిరిగేవాడు ఎవడు?
3.    హిరణ్యకశిపుని అంశతో భారతంలో జనించిన దెవరు?
4.    మహాప్రస్థానంలో ద్రౌపది పడిపోవటానికి కారణం ధర్మరాజేమని చెప్పాడు?
5.    సుప్రతీకమనే ప్రసిద్ధమయిన ఏనుగు ఎవరిది? అతడు ఏ పక్షంలో యుద్ధం చేశాడు?
---------------------------------------------------------------------------------------------------- 
సమాధానములు (జవాబులు):
1.     అర్జునుడు అశ్వమేధపర్వము తృతీయాశ్వాసము – 224 పద్యము
సీఅమ్మహీవల్లభుఁ డర్జునుఁ బిలిచి యధ్వరయుక్తమైనయిత్తురగరత్న
    మనఘ సంరక్షణీయంబు నీ కొరులకు నిప్పని శక్యంబె యెల్లభంగి
    నిక్కార్యమునకు నీ వేగమ్గవలయు నీ యంచితాశ్వము చరియించుచుండ
    నెడనెడ రాజుల కే నశ్వమెధదీక్షితుఁడ నై యుండుట చెప్పు ముచిత
తేకరణనియతి నిరోధంబు కాకయుండ
    నడుపు మని చెప్పి భీముని నకులు రాష్ట్ర
    గోపమునకు సహదేవుఁ గులకుటుంబ
    సమితిరక్షకుఁ బనిచి యుత్సాహమెసఁగ. (224)
2.     సూర్యుడు -
3.      శిశుపాలుడు ఆదిపర్వము తృతీయాశ్వాసము 80 వచనము
హిరణ్య్కశిపుండు శిశుపాలుం డై పుట్టె సంహ్లాదుండు శల్యుం డై పుట్టె ననుహ్లాదుండు ధృష్టకేతుండై పుట్టె.
4.      ద్రౌపదికి అర్జునుని మీద పక్షపాతం ఉంది. మహాప్రస్థానీకపర్వము ఏకాశ్వాసము – 34పద్యము
సీచనునప్పు డయ్యేడ్వురును నతిస్థిర యోగ సాధనపరు లయి సత్వరముగఁ
    బోవంగఁ బాంచాలభూపపుత్రికయోగ మెడలిన మేదినిఁ బడియె నధిప
    పడిన సమీరణుకొడుకు కనుంగొని యన్నతోఁ జెప్పి యయ్యతివవలనఁ
    గాన మెన్నఁడు ధర్మహాని యిట్లగుటకు నరయంగఁ గాత మేమి యని విషణ్ణుఁ
తేడగుచు నడిగిన నాతఁ డిమ్మగువ యింద్ర
    తనయు దెసఁ పక్షపాతిని దానఁజేసి
    సుకృతములు ఫలియింపమిఁ ఊవె దీని
    కిట్టిదురవస్థ పాటిల్లె నీడ్యచరిత. (34)
5.    భగదత్తునిది కౌరవపక్షంలో- ద్రోణపర్వముప్రథమాశ్వాసము – 315 పద్యము
దానవజయ మింద్రున కె
    ద్దానివలనఁ గలిగె మున్ను దానోగ్రము న
    య్యేనుఁగు భగదత్తుఁడు పవ
    మానతనయుదెసకుఁ గొలిపె మదమెలరరన్. (315)

No comments:

Post a Comment