Translate

02 March, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -153

తెలుగు సుద్దులు…..(153)
ఆ.వె॥గురువులేక విద్య గురుతుగా దొరకదు
నృపతి లేక భూమి తృప్తిగాదు;
గురువు విద్యలేక గురుతర ద్విజుడౌ`నే?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
గురువు లేకుండా ఏ విద్యా సంపూర్ణంగా లభించదు (పొందలేము). రాజు లేని రాజ్యము ఎలా పరిపూర్ణత పొందదో అలాగే గురువు కూడా సరిఐన విద్య (జ్ఞానము) లేకుండా గొప్ప ద్విజుడు (బ్రహ్మజ్ఞాని) కాలేడు. అందరూ నిజమైన గురువులు కాలేరు కనుక గురువుగా ఎవరినైనా స్వీకరించే ముందు వారి ప్రజ్ఞాపాటవములు తెలుసుకొనవలసిన ఆవశ్యకతను వేమన తెలియచెప్పుచున్నారు. ॥01-03-2015||

No comments:

Post a Comment