Translate

25 March, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 070 (346 – 350)



గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]


1.    ధర్మరాజు స్త్రీలను ఏమని శపించాడు?
2.   భీష్ముని జెండా గుర్తు ఏమిటి?
3.   బభ్రువాహను తల్లి ఎవరు? తండ్రి ఎవరు?
4.   భగవద్గీత అధ్యాయాలెన్ని? శ్లోకాలెన్నివందలు?
5.    కర్ణుడు అర్జునునిపై వేసిన నాగాస్త్రం ఎవరు?
* ***********************************************************
సమాధానములు (జవాబులు):
1.              స్త్రీలకు రహస్యాన్ని కాపాడే శక్తి లేకుండుగాక అని.  కర్ణుడు తనకు అన్న అనే విషయం కుంతి రహస్యంగాదాచి ధర్మరాజుకు మనోవేదన కలిగించింది. శాంతిపర్వము ప్రథమాశ్వాసము 41 పద్యము
తే|| అంగనాజనమ్ములకు రహస్యరక్ష
    ణంబునందలిశక్తి మనంబులందు
    గలుగ కుండెడు మెల్లలోకముల నని
    శపించె నాధర్మ దేవతాప్రియసుతుండు. (41)

2.             తాడిచెట్టు భీష్మపర్వము ప్రథమాశ్వాసము 86పద్యము
|| పరిధానంబును దేరు నశ్వములుఁ జాపంబుం బరిస్ఫీతవ
     జ్రరుచివ్యాప్తసువర్ణ తాళమయచంచత్కేతువున్ వర్మముం
     గర మొప్పం దెలు పారు మేల్గొడుగుతో గంగాసుతుం డాసుధా
     కరుఁడుంబోలె వెలింగె దర్ప మెసఁగం గౌరవ్యసైన్యాబ్ధికిన్. (86)

౩.       చిత్రాంగద అర్జునుడు పాండ్యదేశపురాజు మలయధ్వజుని కుమార్తె చిత్రాంగద. ఆదిపర్వము  - అష్టమాశ్వాసము -163వచనము
|| …….నర్జునుండును గ్రమ్మఱి మణిపూరుపురంబునకువచ్చి రాజ్యలీల సుఖం బుండి చిత్రాంగదయందు బ్రభ్రువాహనుం డనుపుత్రుం బడసి చిత్రవాహనునకు వంశకరుంగా నిచ్చి వాని వీడ్కొని గోకర్ణంబుఁ జూచుచుఁ బశ్చిమసముద్ర పార్శ్వంబునఁ బ్రభాసం బనుతీర్ధంబునకుఁ జని యందులకు ద్వారవతీ పురంబు కుఱంగలి యని విని. (163)

4.             18 అధ్యాయాలు; 700 శ్లోకాలు భీష్మపర్వము ప్రథమాశ్వాసము

5.             ఖాండవదహనంనాటి అశ్వసేనుడనే పాము అగ్ని ఖాండవం దహించేటప్పుడు తన తల్లితోపాటు అశ్వసేనుడు తప్పించుకొని పోతున్నాడు.  పోనీకుండా అర్జునుడు వేసిన బాణానికి తల్లి చనిపోయింది.  ఆ పగ మనసులో పెట్టుకొని అశ్వసేనుడు కర్ణునాశ్రయించి ఉన్నాడు. కర్ణపర్వము తృతీయాశ్వాసము 328వచనము
|| అట్లు రాధేయకరప్రముక్తం బై కిరీటంబు నిర్ధించి నేలం గలపినయమ్మహోరగంబు క్రమ్మఱంగవిసినం గని కమలనాభుండు కవ్వడితో మనమీఁద మగుడ నిమ్మహాసర్పంబు చనుదెంచుచున్నయది యనిన దీని నెఱుంగవే ఖాండవం బేర్చు నప్పుడు తనతల్లిని రక్షించికొని యనలంబునకుఁ దప్పిపోవం బోవనీక నీ వేసిననన్నాగాంగన మృతి బొందె నప్పగ పాటించికొని కర్ణుకడ నమ్మెయి నున్న యశ్వసేనాభిధానభుజంగంబు. (328)
*************************************************************


No comments:

Post a Comment