Translate

26 March, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -160



తెలుగు సుద్దులు…..(160)
ఆ.వెధర్మమ`రసి పూని ధర్మరాజా`దులు,
       నిర్మలంపు ప్రౌఢి నిల్పుకొనిరి;  
       ధర్మమే నృపులకు తారక యోగంబు   
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                            
ధర్మము (నీతి నియమములు) గురించి సంపూర్ణంగా తెలుసుకొని పట్టుదలతో, ఎన్ని ఇబ్బందులు, బాధలు వచ్చినా (సత్యవాక్యనిష్ఠతో) ధర్మరాజు, సత్యహరిచంద్రులవంటి మహరాజులు ఎనలేని, మచ్చలేని కీర్తిప్రతిష్ఠలు నిలబెట్టుకున్నారు.  ధర్మపాలన రాజులకు అపూర్వమైన యోగము (కీర్తి, ప్రతిష్ఠలు, పరమాత్ముని కృప) కల్గించును. పద్యము ద్వారా ధర్మము యొక్క గొప్పతనమును, ఆవశ్యకతను వేమన నొక్కి వక్కాణిస్తున్నారు. ||25-03-2015||

No comments:

Post a Comment