తెలుగు సుద్దులు…..(155)
ఆ.వె॥కాలవశము బట్టి కర్మజీవుల పిండు
మత్తుల`గుచును మదమత్తు లై`రి;
మత్తులై`న జనుల మనసే`టి మనుసయా?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
కలికాల ప్రభావము వలన నిత్యకర్మానుష్ఠానములను నిరంతరము చక్కగా నిర్వర్తించే కర్మజీవుల సమూహములు సైతమూ తెలివితప్పి మందమతులై (పరమాత్మ జ్ఞానమును కోల్పోయి) మదమత్తులైరి (గర్వము, అహంకారము, గంజాయి సేవనము మొదలగు వాటికి లోబడి అవివేకపు మత్తులో మునిగితేలుతున్నారు). వ్యామోహములో మునిగిన వారి మనస్సు (బుద్ధి) ఏమి మనస్సు (బుద్ధి)? వ్యర్థమైనదని యోగి వేమన డాంబికపు బుద్ధిహీన చర్యలు కూడదని హెచ్చరిస్తూ హితవు పలుకుతున్నారు. ||05-03-2015||

No comments:
Post a Comment