ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
బృహస్పతి కొడుకయిన కచుడు శుక్రుని దగ్గర
ఎందుకు చదవవలసి వచ్చింది?
2.
‘సనత్సుజాతీయం’
ఎవరు ఎవరికి చెప్పారు?
3.
యుద్ధం 18వ రోజు
రాత్రి అశ్వత్థామ బారిపడకుండ తప్పించుకొన్నవారెవరు?
4.
ధర్మరాజుచేత అశ్వమేధం చేయించిన దెవరు?
5.
సుఖానికి నిలయం ఏది?
----------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
మృతసంజీవని విద్యకోసం - ఆదిపర్వము –
తృతీయాశ్వాసము – 102 వచనము; 105&
108 పద్యములు
వ|| దాని నెఱింగి దేవత లెల్ల
నతిభీతులై యసురల నోర్వనోపక శుక్రు వలన మృతసంజీవని వడసి తే నోపునట్టిమహాసత్త్వుం డెవ్వం
డగునో యని విచారించి బృహస్పతిపుత్రుం డయిన
కచునికడకుమ జని యి ట్లనిరి. (102)
క|| కావున మృతసంజీవనిఁ
దే వలయును
శుక్రువలన ధృతిఁ బడసి తప
శ్శ్రీ
విభవ దానిబలమునఁ
గావంగా
వలయు సురనికాయ బలంబున్ (105)
క|| ఏను గచుం డనువాఁడ మ
హానియమసమన్వితుఁడ
బృహస్పతిసుతుఁడన్
మానుగ
వచ్చితి నీకును
భానునిభా
శిష్యవృత్తిఁ బని సేయంగన్. (108)
2.
సనత్సుజాతుడు ధృతరాష్ట్రునికి –
విషయం అధ్యాత్మవిద్య ఇది తెలుగులో తిక్కనగారెందుకో విడిచి పెట్టారు.
3.
కృష్ణ, సాత్యకులు
మరియు పాండవులు – సౌప్తికపర్వము –
ప్రథమాశ్వసము – 193 వచనము
వ|| ఇవ్విధంబున దొరలు తెగినను
బాంచాలప్రభద్రకమత్స్యసైన్యశేషంబులు పోక పెనంగిన నతండు మాతంగవితానవిదళనం బప్పుడు సలిపినకంఠీరవంబు
తనమీఁద హరిణకులంబు కవిసిన నెట్టి దగు నట్టివాఁ డగుచుఁ బేర్చి యార్చె నత్తెఱంగుతుములంబునఁ
బొడగానమిఁ బాండునందనులు కృష్ణసాత్యకులును నాశిబిరమున లేక యునికి యెఱింగె నప్పుడు
కనుంగొను జనంబులకు నితం డశ్వత్థామ యనుబుద్ధి పొడమె నది యెట్లనినఁ గురుపాండవులు భండనంబుఁ
జేయం దొడంగినయది మొదలుగా రాత్రు లచ్చటిజనులు నీలతనువును రక్తాస్యనయనయు రక్తాంబరధరయు
రక్తమాల్యానులేపనయు నగు లేమ యొక్కతి తమవీటి వారు నిద్రపోవుచుండఁ దలలు వీడ మేనులు వికృతంబులై
వ్రేలం బాశంబులఁ గరితురగసహితంబుగాబంధించి ఘోరసంరంబునం దెచ్చి తెచ్చి యశ్వత్థామ యగ్రభాగంబునం
బెట్ట నుగ్రభావంబున నతండుతునుముచు నార్చుచునికిఁ గలలు గాంతు రట్లగుటంజేసి నిద్రాసక్తులం
జంపుటయు నవ్విధంబు నార్పును నేర్పడ ననుసమ్ధించి యక్కలలఫలంబు గాకేమి యని తలమ్చి చొచ్చి
పోటునకు నయ్యరాతి రాత్రిమై వచ్చుట నిశ్చయించి యశ్వత్థామగా నెఱింగి రవ్వీరుండు మెఱుంగు
మెఱచినట్లు వివిధగతులఁ జరించినం జెండాడినం జూచియు నీడంబోక రణక్రీడ సల్పిన నబ్బలుమగండు
సముద్దండ బాహుదండవిలాసుండై. (193)
4.
వ్యాస మహర్షి –
అశ్వమేధపర్వము – ప్రథమాశ్వాసము –
12పద్యము
సీ|| నిష్ఠించి యిబ్భంగి నీ
కేము చెప్పిన వాక్యంబు లెల్లను వఱదఁ గలసి
పోయెనే
నీ దగు బుద్ధి యిం తొప్పదో కాక మర్త్యుఁడు కాఁడు కర్త యీశ్వ
రునినియోగమున
మేలును గీడు నొనరించుఁ గాన నీమదిఁ బాపకర్మ శంక
కలిగెనేనియును
యాగముల దానంబుల నది పాపికొన రాదె యశ్వమేధ
తే|| మధికదక్షిణాన్వితముగ ననఘ
చేయు
మంతతో
భవదీయ చిత్తానుతాప
మంతయును
బాయు రఘురామునట్లు పూరు
భరతులును
బోలె దనతత్పరుఁడ వగుము. (12)
5.
శీలం - ఆరణ్యపర్వము –
సప్తమాశ్వాసము – 442పద్యము
క|| అమరఁగ దాక్షిణ్యము ధ
ర్మమునకుఁ
గుదు రండ్రు కీర్తి మహిమనెలవు దా
నము సత్యము
సుర పురిమా
ర్గము
శీలము సంశ్రయము సుఖంబులకెల్లన్. (442)
****************************************************************
No comments:
Post a Comment