ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1.
సుశర్మకు చిక్కిన విరాటుని రక్షించిస
దెవరు?
2.
ఘటోత్కచునివల్ల కౌరవపక్షంలో ఒక రాక్షసుడు
చనిపోయాడు, ఎవరాతడు?
3.
ఊర్వశి శాపాన్ని అర్జునికి వరంగా పరిణమింప
జేశాడు, ఎవరు?
4.
యుద్ధానికి ముందు దుర్యోధనుడు నమస్కరిస్తే
గాంధారి ఏమని దీవించింది?
5.
యయాతికి ఇద్దరు మామగారలు –
ఎవరు?
***************************************************************
సమాధానములు (జవాబులు):
1.
భీముడు –
ధర్మరాజు ఆజ్ఞతో రథం ఎక్కివెళ్లి, భీముడు సుశర్మను
పట్టి తీసుకొని వచ్చి విరాటుని విడిపించాడు. –
విరాటపర్వము
– తృతీయాశ్వాసము – 203 వచనము & 204పద్యము
వ||అట్టియెడ
ధర్మతనయుం డనిలనందను నవలోకించి సత్వరం బగుచిత్తంబుతో మత్స్యవిభునివలనను సూపుచు ని
ట్లనియె. (203)
తే|| ఇతనియాశ్రయమున మన మెల్ల
బ్రదికి
యున్నవారము గావున నుగ్రరిపుల
పాలువడకుండవిడిపింపఁ
బాడియితని
నెయిదుమెయిదుమురథరయమెసకమెసఁగ.
(204)
2.
అలంబుసుడు –
ఇతడొక మాయావి రాక్షసుడు – ద్రోణపర్వము –
తృతీయాశ్వాసము – 268 వచనము
వ|| …బకావరజుండుడస్సినం బవమానపౌత్రుండు
పడవైచి తాను మీఁ దైజానుకూర్పరముష్టిఘాతంబులు నిర్ఘాతపాతంబులుంబోలెఁ బ్రయోగించి నొప్పించి
యతనితొడలుఁ నెమ్ములు నొక్కుమ్మడిం బొడిపొడిచేసి నుఱిపిడికిం జొచ్చినప్రబలహలికునిలీల
నేలం బెట్టి కాలం జమరి చంపి పొంపిరివోవు మగంటిమిం బేర్చి యార్చినం బాండవబలంబుల సింహనాదంబులుఁ
దూర్యనినదంబులుం జెలంగె నప్పు డాఘటోత్కచుండు ధర్మనందునున కభివందనంబు చేసిన…..(268)
3.
ఇంద్రుడు –
నపుంసకత్వము పొందుమని ఊర్వశి శపిస్తే ఇంద్రుడు దాన్ని అజ్ఞాతవాసంలో అనుభవించితే
సరిపోతుంది
అని వరంగా పరిణమింపజేశాడు. – ఆరణ్యపర్వము –
ప్రథమాశ్వాసము – 367పద్యము
తే|| అనఘ యూర్వశి యిచ్చినయట్టిశాప
మనుభవింపంగవలయు
నీ కవనియందు
నింక
మీపదుమూఁడవ యేఁడుసత్య
సరణి
నజ్ఞాత్వాసంబు సలుపవలయు. (367)
4.
ధర్మం తప్పక జయిస్తుందని –
5.
శుక్రుడు – దేవయాని తండ్రి; వృషపర్వుడు – శర్మిష్ఠ తండ్రి – ఆదిపర్వము – తృతీయాశ్వాసము
***************************************************************
No comments:
Post a Comment