ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. మహాప్రస్థానంలో వచ్చిన కుక్క ఎవరు?
2.
ఘోషయాత్రలో గంధర్వుని పేరేమి?
3. దుష్టచతుష్టయంలో చిన్నవాడెవరు?
4. శకుంతలా దుష్యంతుల కథను సంస్కృతంలో ఓ
కవి నాటకంగా వ్రాశాడు – ఆ కవి ఎవరు? ఆ నాటకం పేరేమి?
5. ధర్మరాజును చంపుతానన్న అర్జునుని వారించిన
దెవరు?
-----------------------------------------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.యమధర్మరాజు –
ధర్మరాజు యొక్క ధర్మనిరతిని పరీక్షించటానికి వచ్చాడు. –
మహాప్రస్థానికపర్వము –
ఏకాశ్వాసము
– 61 పద్యము
సీ|| అ ట్లతిదృఢనిశ్చయంబుగఁ
బలికిన తనపుత్రుఁ గనుఁగొని ధర్ముఁ డధిక
సమ్మోదమును బొంది సారమేయాకృతిఁ బాసి
తా నాత్మరూపంబుఁ దాల్చి
పరమసంభ్రమకృతప్రణతియు నానందభరితుండు
నగునానృపాలుతోడ
నీపుణ్యవృత్తంబు నిర్మల మేధయు
నఖిలభూతంబులయందుఁ గలుగు
తే|| దయయు నాదుచిత్తముఁ బ్రమదమునఁ
దేల్చె
వత్స భులోకమున నిట్టివారుఁ కలరె
తొల్లియును
ద్వైతవనమున దోషదూర
మయిననీమనమున
తెఱం గరసినాఁడ (61)
2.చిత్రసేనుడు –
ఆరణ్యపర్వము – పంచమాశ్వాసము –
395 పద్యము; 396 వచనము
క|| గంధర్వులు దెరలుట విని
గంధర్వవిభుండు
క్రోధకలుషితమతి యై
గంధగజముచందమున
మ
దాంధగతిం
గవిసెఁ గౌరవానీకముపై (395)
వ|| ఇట్లు కవిసి చిత్రసేనుండు.
(396)
3.దుశ్శాసనుడు
4.కాళిదాసు –
అభిజ్ఞాన శాకుంతలము – ( శకుంతలా దుష్యంతుల కథ ఆదిపర్వము
– చతుర్థాశ్వాసము లోనిది)
5.కృష్ణుడు –
నిందింపుమని చెప్పి నివారించాడు. గురుని నిందిస్తే వధించినట్లే అనే
న్యాయంతో – కర్ణపర్వము – తృతీయాశ్వాసము
– 82,84 పద్యములు&85 వచనము
చ||
అతిశితకర్ణ బాణహతి నంగము నొచ్చినదాన నల్గి యి
ప్పతి నిను నొవ్వఁ బల్కుటిది ప్రాభవ
మింతియె కాక నీయెడన్
మతిఁ బటుకోపముం గలదె మారుతసూనుఁడు
నీవుఁ దమ్ములుం
జతురవినీతి నీతనివశంబునఁ గాదె చరింతు
రెప్పుడున్ (82)
క||
నీ విట్టివాఁడ వని ధర
ణీవిభునిం బలుకు మదియ నీచంపుట సం
భావించి పిదపఁ బ్రణతుఁడ
వై వినయము చేయు చిత్తమలర నతనికిన్ (84)
వ||
అ ట్లయిన నసత్యదోషంబునకు గురువధపాతకంబునకుం దొలంగి సమాహితుండ వగుదు…..(85)
***********************************************************
No comments:
Post a Comment