తెలుగు సుద్దులు…..(156)
ఆ.వె॥కడగి వట్టి యాస కడతేర నివ్వదు
యిడుములందు
బెట్టి యీడ్చు గాని;
పుడమి
జనుల భక్తి బొడమంగ నియ్యదు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
నిరర్థకము, ప్రయోజనము లేని సత్యదూరమైన ఆశ (ప్రాపంచిక విషయములపై తృష్ణ) మానవులను అనేకానేక ఇక్కట్లపాలుచేసి (బాధలలోకి నెట్టి) ప్రాపంచిక
లంపటములనుండి
(సంసారిక సంకెళ్లనుండి) బయటపడనీదు, వారిలో భక్తి భావమును (పరమాత్మను
గురించి దృష్ఠి) పుట్టనీయదు –
ముక్తి
కల్గించనీయదని “ఆశ”గురించి జాగ్రత్త సుమా అని వేమన మనలను హెచ్చరిస్తున్నారు.
||07-03-2015||
No comments:
Post a Comment