Translate

13 March, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -158

తెలుగు సుద్దులు…..(158)
కం||దేహము లెస్సగ నుం`డిన
పోహణ తత్వంబుల`న్ని పొందుగ దెలుసున్ (దెలియుం);
దేహము బడలిక బడినను
పోహణ తత్వములు వచ్చి పొందవు వేమా!
భావముః
దేహారోగ్యము (శారీరక, మానసిక) బాగుంటే (ధృఢంగా ఉంటే) తప్ప ప్రౌఢిమ, శ్లాఘింపబడే, ఉత్కృష్ట(ర్ష)మైన పరమాత్మతత్వమును (స్వభావమును, స్వరూపమును) తెలిపే విషయములను, ఓంకార (ప్రణవము) యొక్క విశిష్ఠతను మానవుడు తెలుసుకొనలేడు, పొందలేడు. కనుక మానవుడు ముక్తి పొందడానికి మనసా,వాచా, కర్మణా త్రికరణశుద్ధి కలిగి మెలగవలెను అని వేమన హితవు పలుకుతున్నారు.||12-03-2015||

No comments:

Post a Comment