తెలుగు సుద్దులు…..(159)
ఆ.వె॥అధికుడై`న రాజు యల్పుని జేబట్ట,
వాని మాట చెల్లు వసుధ లోన
గణకులొ`ప్పి యున్న గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ఈ లోకంలో సహజంగా రాజు (అధికారమున్న వారు – నేటి నాయకులు) ఎంత తక్కువవానిని (ఎటువంటి ప్రత్యేకతలేని, విశిష్ఠతలేని వానిని) తనకు సన్నిహితునిగా చేసుకున్నచో (దగ్గరకు చేర్చుకున్నచో) రాజు మూలంగా ఆ సామాన్యునికి సైతము విలువ పెరుగుతుంది, రాజుగారికి కోపం వస్తుందేమో అనో లేక అతను రాజు గారికి లేనిపోనివి చెప్పి తమకు హాని కల్గిస్తాడనో, అతని మాటను కాదనడానికి ఎవరూ సాహసించరు. ఆ అల్పుని యొక్క విలువను వేమన చక్కటి ఉపమానంతో – విలువలేని సామాన్య గవ్వ సైతము కరణము (గణకుడు) ఒప్పుకుంటే, సమ్మతిస్తే డబ్బు క్రింద చలామణి అవుతుందని (పూర్వము గవ్వకూడా అతి తక్కువ విలువ నాణెంగా వాడుకులో ఉండేది; ఇప్పటికీ చిల్లి గవ్వ విలువ చేయడని అంటుంటారుకదా!) మనకు తెలియచెప్పుతున్నారు. ఇంకొక కోణంలో విలువలేని గవ్వలకు సైతమూ గణకులు (జ్యోతిష్కులు) వాడితే (ప్రశ్నలు, సమస్యలకు తరుణోపాయాలు సూచించడానికి) వాటికి సైతమూ విలువ వస్తుందని, కనుక సామాన్య మానవులు సైతమూ ఆ భగవంతుని దగ్గర మసులుతుంటే (ఆరాధిస్తుంటే) వారికి మెల్లగా, మెల్లగా వారికీ మంచి జరిగి విలువ వస్తుందని హితవు పలుకుతున్నారు. ||14-03-2015||

No comments:
Post a Comment