తెలుగు సుద్దులు…..(161)
ఆ.వె॥దానములను సేయ ధర చేతులా`డక
బహు ధనంబు గూర్చి పాతిబెట్టి,
తుదను దండుగ ని`డి మొదలు చెడు నరుడు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ఈ భూమిమీద మానవుడు అత్యాసతో ధనం (సంపద) ప్రోగుసుకొని, లోభత్వముతో తన జీవితకాలంలో దాన్ని సద్వినియోగనికి
(దానధర్మాలకు, పుణ్యకార్యాలకు, భగవంతుని సేవలకు, ఆరాధనలకు, కనీసం తన కుటుంబ సభ్యులకు, బంధు,మిత్రులకు సాయపడటము మొ.వి) వినియోగించకుండా కూడబెట్టి, దాచిపెట్టి చివరకు, వట్టిచేతులతోనే తన చివరి ప్రయాణం చేస్తాడు. తద్వారా అతనికి ఇక్కడా ఆ సంపద మంచి చేకూర్చదు, పరలోకములోను పుణ్యఫలాలు అనుభవించడానికీ ఉపయోగపడక వ్యర్థం అవుతుంది. కనుక, లోభత్వము కూడదు సుమా! పరమేశ్వరుడు ప్రసాదించిన సంపదను తగురీతిలో ధార్మికంగా అనుభవిస్తూ, పరులకు ఉపయోగపడేటట్లు పాటుపడుతూ, భగవంతుని సేవలకు వినియోగిస్తూ ధార్మిక జీవనం గడపమని వేమన హితవు పలుకుతున్నారు. ||27-03-2015||
No comments:
Post a Comment