Translate

11 March, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 068 (336 – 340)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]

1.              బలరాముని తల్లిదండ్రులెవరు?
2.             కృష్ణ అనే పేరు ద్రౌపదికి ఎవరు పెట్టారు?
3.             అజ్ఞాతవాసంలో భీముని పేరేమి?
4.             యుద్ధం 18వ రోజు రాత్రి నిద్రపోతున్నవారిని చంపటానికి అశ్వత్థామకు ఒక సన్నివేశం కూడా  
        కారణమయింది   ఏమా సన్నివేశం?
5.             పద్మవ్యూహంలో అభిమన్యుని అందరూ కలసి చంపేటప్పుడు అర్జునుడేమయ్యాడు?
సమాధానములు (జవాబులు):
1.              రోహిణి వసుదేవులు ఆది పర్వము తృతీయాశ్వాసము 75పద్యము
 || శ్రీ వెలుఁగ రోహిణికి వసు
     దేవున కుదయించె విష్ణుదేవాంశమునన్
     భూవంద్యుఁ డనంతుఁడు బల
     దేవుండు ప్రలంబముఖ్య దితిజాంతకుఁడై. (75)
 
2.             ఆకాశవాణి ఆదిపర్వము సప్తమాశ్వాసము 20పద్యము & 21వచనము
  తరలము|| కులపవిత్ర సితేతరోత్పలకోమలామలవర్ణ యు
                  త్పలసుగంధి లసన్మహోత్పలపత్ర నేత్ర మదాలికుం
                  తలవిభాసిని దివ్య తేజముఁ దాల్చి యొక్క కుమారి త
                  జ్జ్వలనకుండమునందుఁ బుట్టెఁ బ్రసన్నమూర్తి ముదంబుతోన్        (20)
|| ఇట్లు పుట్టినకొడుకుం గూఁతునకు ధృష్టద్యుమ్నుండును గృష్ణయు నను నామంబు లాకాశవాణి జన       
    వినుతంబుగా నుచ్చరించె నట్లు ద్రుపదుండు లబ్ధ సంతానుం డయి సంతసిల్లి యాజునకు యధోక్తదక్షిణ  
    లిచ్చి బ్రాహ్మణులం బూజించి ధృష్టద్యుమ్నుని ధనుర్వేదపారగుం జేయించి యున్నంత నక్కన్య   
    యిపుడు వివాహసమయ ప్రాప్త యయిన. (21)                                                                                                                    

3.             వలలుడు విరాటపర్వము ప్రమాశ్వాసము 84 వచనము
|| ఇట్లు నానాప్రకారంబుల నతని మనంబు వడయుచు వలలుం డనుసమాఖ్య వహింతు నమ్మహీపతి   
    నీవ్వెరివాఁడ వని యడిగెనేని పాండవాగ్రజునకు బానసంబు సేయుదు ననంగలవాఁడ ననిన విని  
    ధర్మజుం డమ్మెయికి సమ్మతించి(84)

4.             ఆరాత్రి ఒకచెట్టుమీద గుడ్లగూబ కాకిపిల్లలను చంపడం అశ్వత్థామ చూడటం సౌప్తికర్వము  
        ప్రథమాశ్వాసము 19 వచనము; 21 పద్యము
|| ఇవ్విధంబున నిద్రావివశంబు లైనయవ్వాయసంబుల వివిధంబు లగువిధంబుల గీటడఁగించి య  
    కౌశికంబు శత్రువులం బొదివి సమయించినమేటిమగని మాడ్కి మోదంబు నొందింపం గని  
    యగ్గురునందనుం డాచందం బొనర్చుటకు డెందంబున నుత్సాహంబు పొడమి పొంగి తనలోన. (19)
తే|| ఇవ్విహంగమ ముపదేశ మిచ్చె నాకు
     నిద్రవోవంగ శత్రుల నిగ్రహింతు
     నింత లె స్సగునే ముంద రేమి తెఱఁగు
     కాననైతిని నాపూనుకార్యమునకు. (20)           

5.             సంశప్తకులతో దూరంగా యుద్ధం చేస్తున్నాడు. ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 393 పద్యము; 394  
        వచనము
|| విని సంశప్తకు లేముతక్క నొరు లావివ్వచ్చు భంగించి బె
       ట్టనికిం బాపి యలంప నేర్పు గలరే యంచున్ వెసం బోయి పి
       ల్చిన నప్పార్థుఁడు నుద్ధతిం జనుడు నక్షీణోగ్రశస్త్రాస్త్రవ
       ర్తనఘోరం బగుసంగరమ బచట రౌద్ర స్ఫూర్తిమైఁ జెల్లగాన్ (393)
|| ఇక్కడ భారద్వాజుండు పద్మవ్యూహంబు కావించినం గౌంతేయాగ్రజు ననుమతి నభిమన్యుం డయ్యొడ్డు    
    భేదించి బృహద్బలలక్ష్మణప్రభృతులగు భూపతులను భూపకుమారులను బెక్కండ్రం బారిసమరి
    యనేకయోధవీరవిక్రమసంకులంబునం జిక్కువడి యుక్కు మురిసినట్లు సమసిన మన మొనలు   
    చెలంగుచుం బాండవబలంబులు పొగులుచుం దమతమ యునికిపట్లకుం జనియె నని సంజయుండు  
    ధృతరాష్ట్రునకు సౌభద్రుండు పడుట చెప్పె ననిన విని నాఁటి కయ్యంబుకలరూ పంతయు నేర్పడ  
    నెఱింగింపు మనుటయు. (394)
*************************************************************   
 

No comments:

Post a Comment