Translate

11 March, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -157



తెలుగు సుద్దులు…..(157)
ఆ.వెపాల లోన పులుసు లీలతో గలసిన,
       విరిసి తునకల`గును విరివిగాను;         
       తెలివి మనము లోన దివ్యతత్వము తేట        
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                  
పాలలో కొంచెము పులుపు (ఉప్పు ఇసుమంత) కల్సినా వెంటనే పాలు తునాతునకలయినట్లు (విరిగినట్లు) మనస్సులో పరమాత్మ తత్వము కొంచము కలిగినా అది అజ్ఞానాన్ని(ప్రాపంచిక లోలత్వాన్ని) విరిచి బ్రహ్మజ్ఞానమును తేటపరుస్తుంది (కల్గిస్తుంది).  కనుక, తెలివితో మసలుకోమని వేమన హితవు పలుకుతున్నారు.  ||10-03-2015||

No comments:

Post a Comment