తెలుగు సుద్దులు…..(152)
ఆ.వె॥దొంగతనము రంకు దొరసియుండు జగతి
రంకులా`డి కిం`త శంక బుట్టు;
దొంగకె`(న్న)రే వెలుంగొ`ప్పు కానట్లు
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ఈ లోకంలో దొంగతనము, జారతనములకు అవినాభావ సారూప్యమున్నది. దొంగతనము చేసేవ్యక్తికి ఎలా వెన్నెల ఇష్టముండదో (తన పని పూర్తిచేసుకొనడానికి చీకటిని అభిలషిస్తారు కనుక) అలాగే వ్యభిచారి కూడా భయం, భయంగా ఎవరన్నాచూస్తారేమోనని అనుమానంతోటే జీకటి బ్రతుకునే కోరుకుంటాడు/కోరుకుంటుంది (బహుశా నాటి కాలము కొంత భయము ఉండేదన్నమాట). జార, చోరత్వములు దూష్యములు కనుక, వేమన ఈ పద్యం ద్వారా చీకటి బ్రతుకులు బ్రతకక వాటికి దూరంగా ఉండమని హితవుపలుకుతున్నారు. ||22-02-2015||
No comments:
Post a Comment