Translate

03 March, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -154



తెలుగు సుద్దులు…..(154)
ఆ.వెఅల్ప సుఖము లె`ల్ల నా`శించి మనుజుండు
       బహుళ దుఃఖములను బాధపడును; 
       పర సుఖంబు నొంది బ్రతుకంగ నేరడు
       విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                  
మానవుడు తాత్కాలికములు, అల్పములు అయిన ప్రాపంచిక(లౌకిక,ఐహిక) సుఖములు, భోగముల గురించి అనేకానేక కష్టములు, బాధలు పడుతుంటాడు; అవి తను అనుకున్న విధంగా లభించనపుడు విపరీతమైన వ్యాకులత, దుఃఖము పొందుతుంటాడు.  కాని, పరమాత్మ సన్నిధిలో లభించే నిజమైన, శాశ్వతమైన పారలోకికాను సుఖము, ఆనందమును (మోక్షము) పొందేదాని గురించి ఆలోచింఛడు, ఆ మార్గములో జీవితాన్ని గడపడం తెలియడు కదా అని వేమన మానవుని ప్రాపంచిక స్వాభావికతను తెలియజెప్పుచూ; ప్రాపంచిక సుఖములకు వెంపర్లాడక, పరమాత్మ (పరబ్రహ్మ)ను గురించి తెలుసుకొని, అపూర్వమైన మానవ జన్మతకు సార్థకత కలిగించుకొనమని ఒక యోగిగా హితవూ పలుకుతున్నారు. ||03-03-2015||

No comments:

Post a Comment