Translate

18 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 064 (316 – 320)




ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
  


1.    ప్రాతికామి ఎవరు?
2.   ధృతరాష్ట్రుని కొడుకు ఒకడు యుద్ధం తరువాత బ్రతికి ఉన్నాడు? అతడెవరు?
3.   జరాసంధుడనే పేరు అతనికి ఎలా వచ్చిమ్ది?
4.   అర్జునునకు పార్ధుడనే పేరు ఎందుకు వచ్చింది?
5.    అజ్ఞాతవాసంలో సహదేవుని పేరేమి?
--------------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.    దుర్యోధనుని సేవకుడు ద్రౌపదిని సభకు తీసుకురావడానికి; అనుద్యూతానికి ధర్మరాజుని తీసుకురావడానికీ ఇతడే వెళ్లాడు. సభాపర్వము ద్వితీయాశ్వాసము -206 పద్యము & 274 వచనము
|| అవనినాథుచేత నాజ్ఞాపితుం డయి
     సూతనందనుండు ప్రాతికామి
    పాండవాగ్రమహిషిపాలికిఁ జని భక్తి
    వినతుఁ డగుచు నిట్టు లనియె సతికి. (206)
|| కావున వారల ననుద్యూతంబునఁ బరాజితులం గావించి విరళ దేశనిర్వాసితులం జేయుట కార్యం బనిన   
    విని ధృతరాష్టుం డొడంబడి యప్పుడ యనుద్యూతార్ధంబు ధర్మనందనుం దోడి తేరం బ్రాతికామిం   
    బంచినం బితృనియోగంబును విధి నియోగంబు నతిక్రమింప నగునే యని. (274)

2.   యుయుత్సుడు -  

3.   జర అనే రాక్షసిచే సంధింపబడినవాడు సభాపర్వము ప్రథమాశ్వాసము 154 వచనము
|| అని దాని నతి ప్రీతిం బూజించి కొడుకు నెత్తికొని దేవీద్వయంబునకు నిచ్చి జరయనురాక్షసిచేత సంధింపఁబడినవాఁడు గావున జరాసంధుం డనుపే రిడి పురంబష్టశోభనంబు సేయించి యారాక్షసి కేఁటేఁట మహోత్సవంబు సేయించుచుం గొడుకు నతిగారవంబునం బెంచిన. (154)

4.   పృధ (ఇంద్రుని) యొక్క కొడుకు కనుక సంస్కృతంలో పార్ధశబ్దం పాండవులందరికీ ప్రయోగించబడ్డది.

5.    తంత్రీపాలుడు విరాటపర్వము ప్రథమాశ్వాసము 100 పద్యము
|| కీలారితనమునకు నేఁ
    జాలుదు నని కొలిచి మత్స్యజనపాలుకడన్
    మే లగునడవడిఁదంత్రీ
    పాలుం డనుపేరితోడఁ బరఁగుదు నధిపా. (100)
**********************************************************

No comments:

Post a Comment