Translate

07 February, 2015

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) -146



తెలుగు సుద్దులు…..(146)
.వెశిష్య వర్గమునకు శివు జూప నేరక
           కానిమతములోన గలుపు నట్టి               
           గురుని యెరుక `రయ గుడ్డె`ద్దు జొన్నరా           
           విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః                  
తన్నాశ్రయించిన శిష్యులకు పరమాత్మతత్వాన్ని సరిగా భోధించలేక, తెలియపర్చలేక, దైవంమీద గాఢ అనురక్తి కల్పించలేక వారిని పెడత్రోవ పెట్టించే (పరమాత్మ, దేవుని ఉనికినే శంకించే వారిగా మార్చే) మిడి,మిడి జ్ఞాన గురువులెటువంటి వారంటే జొన్నచేనులో పడ్డ గుడ్డి ఎద్దు వంటివారు,  గుడ్డి ఎద్దు తనకు కావలసినది తినలేదు, పైపెచ్చు పచ్చటి చేలంతా తొక్కి పాడు (పనికిరాకుండా) చేస్తుందికదా అలాగే దొంగ (జ్ఞాన హీనులు) గురువులు కూడా సుమా అని దొంగ గురువుల గురించి వేమన హెచ్చరిస్తున్నారు. ||06-02-2015||

No comments:

Post a Comment