ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
- సుశర్మ ఏ దేశానికి రాజు?
- యక్ష ప్రశ్నలు వేసిన యక్షుడు ఎవరు?
- భారత యుద్ధంలో పాండవ పక్షానికి సైన్యాధ్యక్షుడెవరు?
- పాండవుల పెద్ద కొడుకు ఎవరు?
- అర్జునిచేత సారధ్యం చేయించుకొన్న గౌరవం దక్కిన వీరుడెవరు?
సమాధానములు (జవాబులు):
1. సుశర్మ త్రిగర్త దేశానికిరాజు – విరాటపర్వము
– తృతీయాశ్వాసము -118
వచనము
వ॥…దీని కనురూపమ్ బగునుద్యోగంబు సేయుం డనినఁ ద్రిగర్తాధీశ్వరుం డగుసుశర్మ దొలుతఁ
గర్ణదుశ్శాసనులతోఁ గొండొక ప్రసంగించి వారలయనుమతి నవనీపతితో ని ట్లనియె.
(118)
2. యమధర్మరాజు – ఆరణ్యపర్వము – సప్తమాశ్వాసము –
462 పద్యము
మత్తకోకిలము॥ఏను ధర్ముఁడఁ జువ్వె రాజకులేంద్ర సత్యము శౌచమున్
దానముం దపమున్ శమంబును దాంతియున్ యశముం బరి
జ్ఞానయుక్తియు నాదుమూర్తులు సమ్మదంబున నిప్డు మ
త్సూను నుత్తమధార్మికున్ నినుఁ జూచువేడుక వచ్చితిన్. (462)
3. ద్రుపదుని కొడుకు, ద్రౌపది
అన్నగారైన ధృష్టద్యుమ్నుడు –
113 వచనము
వ॥ …శ్వేతవంశజాతుం డగుటంజేసి శ్వేతుం డనం బ్రఖ్యాతుండగు ధృష్టద్యుమ్నునకు నుత్కృష్టప్రకారంబున
నభిషేకం బొనర్చి సర్వసేనాధిపత్యంబునకుం బట్టంబు గట్టి యయ్యెనమండ్రును (పాంచలపతి దృపదుడు, మత్స్యవిభుడు విరటుడు, సాత్యకి, జరాసంథాగ్రతనయుడు శౌర్యఘనుడు, సహదేవుడు, చేకితానుడు, శిశుపాలతనయుడుధృష్టకేతుడు,
శిఖండి) దక్కటిదొరలను గనుమ్గొని మధుర వాక్యంబుల
నగ్గించి కౌరవులతోడికయ్యంబునకుం గురుక్షేత్రంబునకు విడియంబోద మని చెప్పి వారి నెల్ల
ధనంజయునకుం జూపి. (113)
4. ఘటోత్కచుడు – ఆదిపర్వము – షష్ఠాశ్వాసము – 235 పద్యము
& 236 వచనము
చ॥నరవరుఁడైన భీమువలనం బ్రభవించె హిడింబకున్ సుతుం
డురుతరభీమరూపుఁడు ఘటోత్కచనాముఁడు
విస్ఫురద్భయం
కరవదనంబు శంఖనిభకర్ణములున్ వికృతాక్షులుం బయో
ధర వరవర్ణమున్ వికటదారుణదంష్ట్రలు
నొప్పుచుండఁగన్. (235)
వ॥ఇట్లు సద్యోగర్భంబునం గామరూపధరుండైన ఘటోత్కచుండు
పుట్టి తత్క్షణంబ నవ యౌవనుండును ననేకాస్త్రశస్త్రకుశలుండును నపరిమిత రాక్షస పిశాచ
బలపరివృతుండును నై తల్లి దండ్రులకుం గుంతీదేవికి మ్రొక్కిన నగ్రనందనుం డగుట
నందఱును గరంబు గారవంబునఁ గొనియాడం గొన్ని దినంబులుండి యొక్కనాఁ డంజలి పుటఘటిత మస్తకుండయి
తండ్రుల కి ట్లనియె రాక్షస పిశాచబలంబులతొడ నాయిమ్ముల నుండెదం బని గలయప్పుడు నన్నుఁ
దలమ్చునది యప్పుడ వత్తునని తల్లిం దోడ్కొని యుత్తరభిముఖుండయి యరిగె నిట పాండవులును
శాలిహోత్రునొద్ద ననేకధర్మశాస్త్ర నీతిశాస్త్రంబులభ్యసించి యమ్మునివరు వీడ్కొని చని
విదర్భమత్సత్రిగర్తకీచక విషయంబులు (దేశంబులు) గడచి యేక చక్రం బను నగ్రహారంబు గని.
(336)
5. ఉత్తరుడు - ఉత్తరగోగ్రహణం
ముందు ఉత్తరునికి బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు ఉత్తరునికి సారధ్యం చేశాడు – విరాటపర్వము – చతుర్థాశ్వాసము – 49 వచనము
వ॥ అనుచు ధనుస్తూణీరకృపాణముద్గరాదివివిధసాధనంబులు రథంబుపైఁ బదిలంబుగా నిడి నొగలెక్కి
పగ్గంబుల స్రుక్కు సక్కంజేయ నుత్తరుండును బసులం బట్టినదెస గోపాలకు నడిగిన వాఁడు పితృవణంబువలనని చెప్పిన వినుచు
రథా రోహణంబు సేసి వెడలి పౌరవృద్ధపుణ్యాంగనాభూసురసమూహంబులు బృహన్నలం
జూచి తొల్లి ఖాండవదహనంబున నర్జునకు నీకతంబున నయిన మాంగల్యం బెట్టి దట్టిద భవత్సహాయ్యంబున
భూమింజయున కయ్యెడు మని దీవించి సేసలు సల్లం బురంబు నిర్గమించి నిరర్గళపరాక్రముండయిన
యాఫల్గునునైపుణంబున వల్గదశ్వం బగురథంబు రయంబునకు మెచ్చుచుం బరేతనిలయప్రాంతప్రదేశంబు
సేరం జని. (49)
************************************************************
No comments:
Post a Comment