ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. “ధృత రాష్ట్రుని కౌగలి” ఈ మాటకు అర్ధం ఏమిటి?
పదబంధం ఎందుకు వచ్చింది?
2. ఉలూకు డెవరు? ఎవరిచేత చనిపోయాడు?
3. యుద్ధానంతరం పట్టాభిషిక్తుడై ధర్మరాజు ఎంతకాలం రాజ్యం చేశాడు?
4. సాత్యకి ధనుర్విద్యా గురువెవరు?
5. దుష్ట వతుష్టయం ఎవరు?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1. పైకి ప్రేమనటిస్తూ మోసం చేసి ప్రాణం తీసే విధానం
– యుద్ధం అయిన తరువాత పాండవులు ధృతరాష్ట్రునికి నమస్కారం
చేస్తున్నారు. అందులో
భీముడు నమస్కారం చేయబోతూంటే కృష్ణుడు భీముని తప్పించి ఒక ఇనుప భీముని ధృతరాష్ట్రుని
దగ్గరకు నెట్టాడు. ధృతరాష్ట్రుడు దాన్ని గట్టిగా కౌగలించుకొని పొడిపొడిగా
రాలిపోయేటట్లు నలిపివేశాడు. పైగా భీమా! చనిపోయావా అని ఏడ్చాడు. “చనిపోలేదు మామా”
అని కృష్ణుడు ఓదారుస్తాడు. – స్త్రీపర్వము –
ప్రథమాశ్వాసము – 129&132 వచనముlu;
130-131 పద్యములు
వ|| ధృతరాష్ట్రుం డిట్టివాఁడు
కాఁగలవాఁ డని తొల్లి యెఱింగి త్రికాలవేది యైన కృష్ణుం డయోమయంబుగా భీమప్రతిరూపంబు చేయించి
సంగ్రహించి నిగూఢ ప్రకారంబునం దత్ప్రదేశంబునకుఁ దెప్పించినవాఁడుకావున గ్రక్కున నయ్యినుపరూ
పజ్జగతీశ్వరుం జేర నిలిపిన నది భీమసేనుండ కాఁ దలంచి. (129)
క|| కోపం బుత్కట మై యా
రూపము నిరుగేలఁ బట్టి రూఢత ఘోరా
టోపం
బెసకమెసఁగ నా
భూపతి వెసఁ గౌఁగిలించి పొలు పఱ విఱిచెన్.
(130)
లయభారతి|| పెరుఁగఁగ నిజాంగములు
సరభసపరిస్ఫురణ
మరుదుగ జనావలులు నిరుపమవిధం బి
న్నరపతిబలం బనఁగఁ గరయుగముతో లవియ
నురము చదియం బెలుచఁ దొరఁగఁగ బొరిన్ నె
త్తురులు ముఖరంధ్రములఁ బరవశత మానసము
పొరయుటకుఁ జొచ్చియును సరి కొనఁగఁ గంటిన్
వరసుతున కిప్పు డనుపరమపదవిన్ మగుడ
గురునృపతి యాప్రతిమ బొరి నిటులు పుచ్చెన్. (131)
వ|| ఇత్తెఱంగున దశసహస్రసామజసమానబలుం
డగునయ్యంధనృపతి గంధవహనందన ప్రతిరూపంబు భగ్నంబు చేసి పెంపున నెడఁద నిర్భరహర్షంబు నొందియు
మెఱ మెచ్చునకై భీమునిం
బేర్కొని హాహాకారంబు లెసంగ రోదనంబు చేసినఁ జిఱునవ్వునం దనవదనకమలం బొప్పం గమలనాభుం డతని
కి ట్లనియె. (132)
తే|| అడలనేటికి నీచేతఁ బడఁడు
భీముఁ
డిపుడు
భంగింపఁబడినది యినుపరూపు
వినుము నీకోప మెఱిఁగియ వెనుక కతనిఁ
దిగిచి
యేను నీముందట దీని నిడితి. (133)
2. ఉలూకుడు శకుని కొడుకు. సహదేవుని చేతిలో చనిపోయాడు.
–
శల్యపర్వము – ప్రథమాశ్వాసము –
386పద్యము
సీ|| ఆసౌబలుండు శరాసనాంతరదీప్తుఁ
డగుటయు నకులుఁడు ననిలసుతుఁడుఁ
దాఁకిన వారి నతండు పెక్కమ్ముల నొప్పింప
నతనితనూజుఁ డనిల
సుతసహదేవుల సునిశితశరవర్షమునఁ గప్ప
నయ్యూలూకుని ననేక
సాయకంబుల నొంచి శకునిమై నఱువదియమ్ములు
నాటించి యనుచరులను
తే||
బెగడు పఱిచె నాభీముండు బె ట్టులూకుఁ
డడరి యన్నకులానుజు నంపవెల్లి
ముంప నతఁ డేచి పటుభల్లమున శిరంబు
త్రుంచె నన్నలయెడలు సంతోష మొంద. (386)
3. 36 సంవత్సరములు – మౌసలపర్వము
– ఏకాశ్వాసము – 3 పద్యము
సీ॥భారతసంగ్రామపారీణుఁ డై జయరమ యుల్లసిల్ల సామ్రాజ్యమునకుఁ
బాండవముఖ్యునిఁ
బట్టంబు కట్టినయది యాది కాఁగ ముప్పదియు నైదు
సంవత్సరంబులు
చన ననంతరవత్సరంబునఁ బ్రజకు భయం బొనర్చు
నుత్పాతములు
పుట్టె నుర్వీశ విను మహావాయువు శర్కరావర్షి యగుచు
ఆ॥వీచు నర్కునుదయవేళల బింబంబు
బలిసి
తోఁచు ఘనకబంధసమితి
నీరదములు
లేక నిర్ఘాతపాతముల్
కలుగు
నుల్క లెల్లకడల డుల్లు. (3)
4. అర్జునుడు -
5. దుర్యధనుడు, దుశ్శాసనుడు,
కర్ణుడు, శకుని -
ఉద్యోగపర్వము – తృతీయాశ్వాసము –
392వచనము
వ॥అని విచారించె నిట్లు దుష్కార్యాలోచనంబు సేసి దుర్యోధనదుశ్శాసనశకుని
కర్ణు లగుదుష్టచతుష్టయంబు మొదలుగాఁ గలయవినీతులు దైతేఅమర్దను మర్దింప నిశ్చయించి రయ్యవసరంబున.
(392)
****************************************************************
No comments:
Post a Comment