ఓం గణేశాయనమః – గురుభ్యోనమః
__/\__
నారాయణం నమస్కృత్య
– నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసం – తతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. ద్రోణుడు సైన్యాధ్యక్షుడయ్యాక దుర్యోధనునకు
ఒక వరం ఇచ్చాడు ఏమిటది?
2. ఘటోత్కచుని చంపిన కర్ణుని చంపుతాననిబయలుదేరిన
ధర్మరాజును ఆపిన దెవరు?
3. భీముని సారధి ఎవరు?
4. విందాను విందు లెవరు? ఎవరిచేత చనిపోయారు?
5.శల్యుని జెండా ఏమిటి?
----------------------------------------------------------------------------------
సమాధానములు (జవాబులు):
1.
అర్జను డడ్డపడకపోతే ధర్మరాజును ప్రాణాలతో
పట్టితెస్తాను. – ద్రోణపర్వము –
ప్రథమాశ్వాసము – 113పద్యము.
చ. నరుఁ డెడ సొచ్చెనేని విను
నా కది దుష్కర మే నొకండనే
సురగణ మైన వ్రేలిఁ గొని చూపఁగఁ జాలరు వాఁడు లేనిచోఁ
దిర మయి
పోర నిల్చిన యుధిష్ఠిరుఁ ద్రౌపదిపుట్టినింటివే
వురు
వెఱఁ గంది చూడ నలవుం జలముం జెడఁ బట్టి తెచ్చెదన్. (113)
2. వ్యాసమహర్షి –
అయిదవరోజుకు నీవు రాజు వవుతావు. ఇంత పరాక్రమ ప్రకటనం,
వేదన అవసరం లేదంటాడు.- ద్రోణపర్వము
– పంచమాశ్వాసము – 258,259 & 264పద్యములు; 260 వచనము.
క.తనచేతన సూతసుతుం
దునుముదుఁ
గా కనుచు నలుకతోడ రయమునం
జనియెడు
ధర్మసుతుం డీ
తని నూరక
చూచు చునికి తగునే మనకున్. (258)
ఆ.అని రథంబు పెలుచఁ జన నిచ్చె
నట్లు క్రో
ధాంధవృత్తి
నరుగునవ్విభునకు
సమ్ముఖంబు
కాఁగ సత్యవతీసుతుఁ
డరుగు
దెంచి కరుణ నాదరించి. (259)
వ.అతండు ప్రణతుం డైన దీవించి
యి ట్లనియె.(260)
క.విను మే నగుదివసంబున
నినుఁ
బొందు ననూనమేదినీరాజ్యశ్రీ
యనుమాన
మేమియును లే
దని గ్రక్కున
నమ్మునీంద్రుఁ డరిగె నరేంద్రా. (264)
3.
విశోకుడు –
6వ రోజు యుద్ధంలో ఇతని పాత్ర ఉంది. – భీష్మపర్వము
– ద్వితీయాశ్వాసము – 365, 367
పద్యములు;
366 వచనము
తే.ఆర్తుఁడై యవ్విశోకుని నడిగె
భీముఁ
డెచట
నున్నాఁడు నాయొడ లెట్లు ప్రాణ
సహిత
మై యుండు నతఁ డొకచంద మైన
నేమిగతిఁ
బోదు నక్కట యెఱుఁగఁ జెపుమ. (365)
వ. అనిన విశోకుండు ధృష్టద్యుమ్నున
కి ట్లనియె. (366)
చ. గొదగొని ధార్తరాష్ట్రు లతిఘోరవిధంబునఁ
జుట్టు ముట్టిన
న్మదమునఁ
దేరు డిగ్గి హరిణంబులపైఁ జనుసింహమో యన్
గదఁ గొని
నన్ను నియ్యెడ నకంపితసుస్థితి నిల్వఁ బంచి
బె
ట్టిదముగఁ
జొచ్చె నాహవపటిష్ఠుఁడు భీముఁడు వారి సైన్యమున్. (367)
4. విందాను విందులు అవంతీనగరరాజులు
- అర్జునిచేతిలో చనిపోయారు. - ద్రోణపర్వము –
తృతీయాశ్వాసము –
144 & 147 వచనములు; 143,146 & 148 పద్యములు.
క.విందానువిందు లేక
స్యందనగతు లై కడంగి సైన్యంబులుఁ దా
రుం దెప్పదెరల నాసం
క్రందననందనునిమీదఁ గవిసిరి కడిమిన్. (143)
వ.ఇ ట్లవంతీశ్వరు లురవడించి
(144)
క.తోడన కడువేగంబునఁ
గ్రీడి
తురంగముల సూతుఁ గేతనమును దు
న్మాడుచు విందునితల యిల
పై డొల్లఁగ నేసెఁ దీవ్ర భల్లప్రహతిన్. (146)
వ.
ఇట్లు
తలఁదునుముటయు బలుగాలిం గూలుతరువుపోలికం బడినయగ్రజు నాలోకించి
యనువిందుం డలుక యు నుమ్మలికంబు నుల్లంబునం బెనంగొన గదగొని సంరంభంబున. (147)
చ.
అరదము
డిగ్గి
తీవ్రగమనాతిశయంబునఁ గిట్టి బాహువి
స్ఫురణ తలిర్ప దానవనిషూదనుఫాలము వ్రేసి యార్వ ను
ద్దరరభసం బెలర్ప గదఁ ద్రుంచి పదంబులు బాహుశాఖలున్
శిరమును ద్రెంచి వాని బలిసేసె ధనంజయుఁ డాజిభూమికిన్. (148)
5.
అరటిచెట్టు – భీష్మపర్వము – ప్రథమాశ్వాసము – 87 పద్యము
సీ.
కాంచనమయవేదికాకనత్కేతనోజ్జ్వలవిభ్రమం బొప్పఁ గలశజుండు
గనకగోవృషసాంద్రకాంతికాంతధ్వజవిభవవిలాసంబు వెలయఁ గృపుడు
మణిసింహలాంగూలమహిత కేతు ప్రభాస్ఫురణంబు మెఱయంగ గురుసుతుండు
రత్నశిలారశ్మిరాజితకదళికామహిమ శోభిల్లంగ మద్రవిభుఁడు
తే.
వెడలి
తమతమచతురంగవితతు లెల్ల
నుచితగతి నూల్కొనంగఁ జేయుచుఁ గడంగి
సంగరోత్సవసంభృతోత్సాహు లగుచు
నగుచుఁ దగుమాటలాడుచు నడచి రెలమి. (87)
******* *****************************************************
No comments:
Post a Comment