తెలుగు సుద్దులు…..(143)
కం||యీ కపట నాటకంబును
యీ కపటపు చదువుల`న్ని యింపు దలిర్పన్
యే కపటా`త్ముడు సేసెనొ
యా కపటా`త్మునకు మ్రొక్కి యలరుము వేమా!
భావముః
ఈ మాయాజీవన్నాటకాన్నిచక్కగా రక్తికట్టేట్టు, ఈ మాయా జీవనగమనానికి యోగ్యము, హితకరము, అవసరమైన , తెలివితేటలన్ని ఏ మాయావి, జగన్నాటక సూత్రధారి అనుగ్రహించాడో, ఆ పరమేశ్వరునికి మ్రొక్కి (సేవించి) ఆనందించండి (తరించండి). నేను చేస్తున్నాను, నావలన జరుగుతున్నదనే అహం భావము పొందకుండా అందరము ఆ పరమేశ్వరుని అనుగ్రహముతో ఆయన ఆడించినట్లు మన, మన పాత్రలను ఈ విశ్వజీవననాటకంలో పోషిస్తున్నామని, ప్రకృతిఫలాలను అనుభవిస్తున్నామని అందుకు సదా మనము జగన్నాటక సూత్రధారికి కృతజ్ఞులమై యుండాలని వేమన హితవు పలుకుతున్నారు. ||31-01-2015||
No comments:
Post a Comment