Translate

02 February, 2015

కవిత్రయ శ్రీమదాంధ్రమహాభారత ప్రశ్నోక్తి- 055 (271 – 275)



ఓం గణేశాయనమఃగురుభ్యోనమః
                                                                         __/\__       
నారాయణం నమస్కృత్య  – నరంచైవ నరోత్తమమ్|
దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్|
[డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తిగారి మహాభారత ప్రశ్నోక్తి (క్విజ్) పుస్తకము (1994) ఆధారంగా]
1. భీష్ముడు పడేనాటికి కౌరవులెంతమంది చనిపోయారు?

2. యుద్ధంలో ద్రోణుడు కవచధారణ మనే విద్యను ఎవరికిచ్చాడు?
3. సుదక్షిణుడెవరు? ఎవరిచేత చనిపోయాడు?
4. శ్రుతాయుధుడు (శ్రుతాయువు) ఏ దేశపురాజు? ఎవరిచేత చంపబడ్డాడు?
5. అర్జునునిపై వైష్ణవాస్త్రం ఎవరు ప్రయోగించారు? అది ఏమయింది?
---------------------------------------------------------------------------------- 
సమాధానములు (జవాబులు):
1.ఇరవై ముగ్గురు.
2.దుర్యోధనునకు ఈ విద్యతోనే 14వ రోజున దుర్యోధనుడు ధైర్యంగా అర్జునుని ఎదిరించాడు. ద్రోణపర్వము
          తృతీయాశ్వాసము 179 & 200 వచనములు
|| కడంగి రంతఁ గురుపతి కూడవచ్చి కుంభసంభవకృతం బగుకవచంబుకతంబున భయంబు తక్కి బలంబునకుం దలకడచి…… (179)
|| .. బురందరనందనుండతని కి ట్లనియె నిది యొక్క కవచధారణంబు మున్ను ద్రోణుఁ డొక్కరుండ యెఱుంగుఁ బదంపడి నాకు నెఱిఁగించె నిప్పుడు సుయోధనుండును నెఱుంగు తెఱంగు కావించెంగావలయు.. (200)

3.కాంభోజ దేశపు రాజు కౌరవపక్షంలో పోరాడి 14వ రోజున అర్జునునిచే చనిపోయాడు. - ద్రోణపర్వము తృతీయాశ్వాసము 95 పద్యము
సీ|| అర్జునుం డతసి నేడమ్ముల నేసినఁ బదియేను శరములఁ బార్ధుఁ గృష్ణు
    విశిఖత్రయమున నవ్విభుఁ డేయ నాతని విజయుఁ డస్త్రద్వయవిహతుఁ జేయ
    బాణముల్ మూఁటను బటుశక్తిఁ గ్రీడి నొప్పించి కాంభోజుండు పేర్చి యార్చె
    నరుఁ డల్గి వెసఁ బదునాలుగు తూపుల సూతశ్వకోదండ కేతనములఁ
తే|| గూల్చి దొడ్డనారసమున గుండెకాయ
    పగుల బెట్టేయుటయు నతిప్రబలపవన
    భూరిరయమునఁ గూలుమహిరుహంబు
    తెఱఁగు దోఁప సుదక్షిణుఁ డొఱలి కెడెసె. (95)

4.అంబష్ఠ దేశపు రాజు 14వ రోజున అర్జునుని చేతిలో చనిపోయాడు. - ద్రోణపర్వము తృతీయాశ్వాసము 104 వచనము & 105 పద్యము
|| ఇమ్మెయి నద్భుతవిక్రమంబున నతిక్రమించి కడంగుకవ్వడి నంబష్ఠపతి యగు శ్రుతాయువు మార్కొని నొగ నొగం దాఁక నరదంబు పఱపుటయు. (104)
|| అతనిశరాసనంబును హయంబులఁ ద్రుంచిన నాశ్రుతాయు వు
    ద్యతగద నొప్పఁ బట్టి దనుజాంతకు వ్రేసె నరుండు తద్గదా
    హతి యొనరించె నొండుగద నాతఁడు వెండియు విక్రమించినన్
    శతమఖసూతి యాతనిభుజంబులుఁ గంఠముఁ ద్రుంచె వ్రేల్మిడిన్ (105)

5.భగదత్తుడు అది కృష్ణుని వక్షస్థలానికి అలంకారమయింది. - ద్రోణపర్వము ప్రథమాశ్వాసము 354
               &355 పద్యములు
|| రభసోదగ్రతఁ బూన్చి దీప్తు లడరం బ్రాగ్జ్యోతిషాధిశ్వరుం
     డభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు చూ
     చి భుజోల్లాసివిభాసి యై పెలుచ వాయచెం దద్బలం బెల్ల భూ
     రిభయోద్రేకతరంగితం బగుచు ఘూర్ణిల్లంగ రౌద్రాకృతిన్ (354)
|| అప్పుడు శౌరి పార్ధునకు నడ్డముగాఁ దన మే నమర్చి ను
    న్గప్పెసలారుపేరురమునన్ ధరియించిన నమ్మహాస్త్రమం
    దొప్పె నవారుణాంబుజకృతోజ్వలమాలిక యై చిరస్థితిం
    జొప్పడి నూతనాభ్రతలశోభిత మైనమెఱుంగుచాడ్పునన్ (355)

******************************************************************************************

No comments:

Post a Comment