తెలుగు సుద్దులు…..(148)
ఆ.వె॥దేశ వేషములను తేట సేయక దేవు
డా`త్మ లోన నుండు న`నగి పెనగి
వేస మ`రసిచూడ గ్రాసంబు కొరకయో
విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
ఎవరు ఎన్ని వేషాలు వేసినా పరమాత్మ (భగవంతుడు) మటుకు ప్రతిజీవి ఆత్మలో స్నేహంతో మమైకమై జతపడి ఉంటాడు. ఈ సత్యాన్ని (పరబ్రహ్మతత్వాన్ని) గ్రహించినవారే దైవజ్ఞులు. కపట వేషదారులను (చిత్తశుద్ధి లేనివారు) జాగ్రత్తగా పరిశీలిస్తే (వివరము తెలుసుకుంటే) ఆ వేషాలన్ని పొట్టకూటికోసమే అనే సత్యం బయటపడుతుంది సుమా! పైపై వేషభాషలకు మోసపోవద్దని వేమన హెచ్చరిస్తున్నారు.
శ్రీశ్రీశ్రీ శంకరాచార్యుల వారి భజగవిందం శ్లోకాల్లో ఇదే హెచ్చరిక చేయబడింది కదా!
శ్లో॥జటిలో
ముణ్డీలుఞ్చిత కేశః
కాషాయాంబర బహుకృత వేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో
హ్యూదర నిమిత్తో బహుకృత వేషః ||
భజగవిందం భజగోవిందం
భజగోవిందం మూఢమతే!
బోడికొట్టినను, జడలు బెంచినను భువిలో మూర్ఖుడు బ్రహ్మంబును చూడలేడు; మఱి పొట్టకూటికై దొంగ వేషములు (పలువేషాలు)వేయునురా తెల్సుకొనము. ముక్తికి “ గోవిందా ” యని హరి నామ స్మరణ చేయరా ఓ మూఢా! భగవన్నామ స్మరణ మించినది లేదు. ||10-02-2015||

No comments:
Post a Comment